Srisailam Dam Opened: శ్రీశైలం గేట్స్ ఓపెన్.. కృష్ణమ్మ పరవళ్లు!

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో పెద్ద పెద్ద ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి.

  • Written By:
  • Updated On - July 23, 2022 / 01:11 PM IST

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో పెద్ద పెద్ద ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి. చాలా ప్రాజెక్టులు పరిధికి మించి జల సందడితో పరవళ్లు తొక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీశైలం గేట్లు తెరుచుకున్నాయి. ఏపీ మంత్రి అంబటి రాంబాబు మూడు క్రేస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. అంతకుముందు ఆయన కృష్ణమ్మకు సారె సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి రాంబాబు,ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి ఉన్నారు.

ప్రాజెక్టు వివరాలు

ఇన్ ఫ్లో : 81,853 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో : 57, 481

పూర్తి స్దాయి నీటి మట్టం : 885 అడుగులు

ప్రస్తుతం  : 882.50 అడుగులు

పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు

ప్రస్తుతం : 202.0439 టీఎంసీలు

కుడి, ఎడమ గటు జలవిద్యుత్ కేంద్రాలలో  విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.