ఎంతో సంతోషంగా దేవుడి దర్శనానికి బయలు దేరిన భక్తులు..తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారు. వారు ప్రయానికి ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా (Tractor Overturned) పడడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన బాపట్ల జిల్లా (Bapatla District) కర్లపాలెం మండలంలోని యాజలిలో చోటుచేసుకుంది. ప్రస్తుతం వాహనాలు పెరిగిపోయాయి. చిన్న , పెద్ద అనే తేడాలేకుండా ప్రతి ఒక్కరు డ్రైవర్లు గా మారిపోతున్నారు. ఓవర్ స్పీడ్ …మద్యం మత్తు..నిద్ర మత్తుతో డ్రైవింగ్ చేస్తూ అనేక ప్రమాదాలు చేస్తూ అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చెపుతూ..రోడ్డు నియమాలు పాటించాలని కోరుతున్న పట్టించుకోవడం లేదు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
తాజాగా బాపట్ల జిల్లాలో అదే జరిగింది. కొండపాటూరు పోలెరమ్మ తల్లిని దర్శించుకునేందుకు కొంతమంది ట్రాక్టర్ లో బయలుదేరగా..మార్గమధ్యలో ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 14 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా..మరికొంతమందికి గాయాలు అయ్యాయి. ప్రమాద సమాచారం తెలిసి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ట్రాక్టర్ అతివేగమే ప్రమాదానికి కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. వాహనాలను నడుపుతున్న సమయంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ప్రతీ ఒక్కరికి కుటుంబం ఉంటుందనే విషయం మర్చిపోవద్దని, డ్రైవర్లు కూడా మీ కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకొని వాహనాలను నడపాలన్నారు.
Read Also : Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ లో భారత్ బోణీ, తొలి పతకం అందించిన మను బాకర్