Site icon HashtagU Telugu

Rajya Sabha Elections: రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు వైసీపీ అభ్యర్థులు

Rajya Sabha Elections

Rajya Sabha Elections

Rajya Sabha Elections: దేశంలో ఎన్నికల హడావుడి ఊపందుకుంది. లోకసభ ఎన్నికలతో పాటు రాజ్యసభ హీట్ మొదలైంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో కొందరు నేతలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని 3 స్థానాలకు ముగ్గురు అభ్యర్థులు మాత్రమే మిగిలిపోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి వావిరాజు రవిచంద్ర ఏకగ్రీవమయ్యారు. ఇక పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వైఎస్సార్‌సీపీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా నామినేట్ అయ్యారు. ఎన్నికైన ఆ ముగ్గురు అభ్యర్థులు గొల్ల బాబురావు, మేడా రఘునాథ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ సారి ప్రతిపక్ష పార్టీ టీడీపీ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం గమనార్హం. టీడీపీ చరిత్రలో తొలిసారి ఎగువసభకు వెళ్ళకపోవడం తొలిసారి. రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో సత్తా చాటాలన్న నిర్ణయంతో రాజ్యసభ జోలికి వెళ్ళలేదు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.

కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లోక్‌సభకు 6 సార్లు ఎన్నికైన ఆమె తొలిసారి రాజ్యసభ బరిలోకి దిగారు.బీజేపీ తరుపున చున్నిలాల్ గరాసియా, మదన్ రాథోడ్‌లు రాష్ట్రం నుంచి ఎగువ సభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.దీనితో పాటు బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా మరియు ఆ పార్టీకి చెందిన మరో ముగ్గురు అభ్యర్థులు మంగళవారం గుజరాత్ నుండి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నడ్డాతో సహా మొత్తం నలుగురు బిజెపి అభ్యర్థులను పార్లమెంటు ఎగువ సభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నడ్డాతో పాటు, వజ్రాల వ్యాపారి గోవింద్‌భాయ్ ధోలాకియా, బిజెపి నాయకుడు జస్వంత్ సింగ్ పర్మార్ మరియు మయాంక్ నాయక్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మధ్యప్రదేశ్ నుంచి బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందులో బీజేపీకి చెందిన ఎల్ మురుగన్, ఉమేష్ నాథ్ మహరాజ్, మాయా నరోలియా, బన్షీలాల్ గుర్జార్ పేర్లు ఉన్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి అశోక్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. కాగా నిన్న మంగళవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది.

Also Read: Anushka Sharma-Virat Kohli: విరాట్ కోహ్లీ- అనుష్క శ‌ర్మ జంట ఎక్కడ ఉందో తెలుసా..?