రెండేళ్ల క్రితంచంద్రబాబు (TDP Chief)పై రాళ్ల దాడి (Stone Attack) చేసిన నిందితులను పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. నిందితులను కనికంటి సజ్జన్ రావు, బెజవాడ కార్తీక్, పరిమి కిశోర్ గా గుర్తించారు. 2022 నవంబర్ 5న ఈ ఘటన జరిగింది. జగన్ సీఎం గా ఉన్న ఆ టైములో..చంద్రబాబు ప్రతిపక్ష నేత గా ఉన్నారు. చంద్రబాబు నందిగామలో పర్యటిస్తూ (Chandrababu Nandigama Tour) ఆయన ఉన్న వాహనంపై అభివాదం చేస్తూ వస్తుండగా స్థానిక రైతు బజార్ వద్ద చందర్లపాడు రోడ్డులో కొందరు వీధి లైట్లు ఆర్పివేసి రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూదనరావుకు గాయాలయ్యాయి. దీనిపై వెంటనే పోలీసులకు పిర్యాదు చేసిన పట్టించుకోలేదు. ఈ ఘటన వెనుక జగన్ హస్తం ఉందని అప్పట్లోనే టిడిపి శ్రేణులు ఆరోపణలు చేసిన..పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు.
కానీ ఇప్పుడు వైసీపీ హయాంలో జగన్ అండ చూసుకొని రెచ్చిపోయిన వారందరి పై బాబు రివెంజ్ తీర్చుకుంటున్నారు. నారా లోకేష్ అయితే ఓ రెడ్ బుక్ నే పెట్టుకున్నాడు. వైసీపీ నేతలు చేసిన దాడులు , అక్రమాలు, సోషల్ మీడియా వేదికగా చేసిన విమర్శలు ఇలా అన్నింటిని నోట్ చేసుకొని..ఆలా చేసిన వారిపై వరుస కేసులు పెట్టిస్తూ వారికీ చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ కి చెందిన నేతలపై , వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ పై కేసులు నమోదు అయ్యి..వారి బెండు తీస్తున్నారు. ఈ కేసులకు భయపడి..అప్పుడు రెచ్చిపోయిన PTM బ్యాచ్..ఇప్పుడు క్షేమపణలు చెప్పడం..కొంతమందితే ఏకంగా రాజకీయాలను వదిలేస్తున్నామని ప్రకటించడం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి బాబు మాత్రం వైసీపీ బ్యాచ్ కి నిద్ర కూడా పోనివ్వడం లేదు.
Read Also : Jharkhand Elections Result : జార్ఖండ్‌లో జయహో ‘ఇండియా’.. సీఎం సోరెన్ దంపతులు సూపర్ హిట్