AP BRS: వైసీపీ పాలనతో ఏపీ అప్పుల ఊబిలో మునిగి దివాళా తీస్తోంది: డాక్టర్ తోట

బి ఆర్ ఎస్ బలమైన శక్తిగా ఎదిగి రానున్న ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుందని స్పష్టం చేశారు.

  • Written By:
  • Publish Date - September 19, 2023 / 05:55 PM IST

వైసీపీ అసమర్ధ పాలనలో అన్నీ రంగాలు కుదేలై రాష్ట్రం అప్పుల ఊబిలో మునిగి దివాళా తీస్తోందని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు. స్థానిక ఆటోనగర్లోని బిఆర్ఎస్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యాలయంలో చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గణపతి పూజల్లో పలువురు ముస్లిం సోదరులు పాల్గొని హిందూ, ముస్లింల ఐక్యతను చాటారు.ఈ సంధర్భంగా తోట మాట్లాడుతూ హిందూ ముస్లింల ఐక్యతకు వినాయక చవితి పండుగ ప్రతీకగా నిలుస్తోందని అన్నారు.

ఇరు తెలుగు రాష్ట్రాలు అన్నీ రంగాల్లో అభివృద్ది పధంలో దూసుకెళ్లి దేశంలోనే అగ్రగామి రాష్ట్రాలుగా నిలవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఏపీలో వైసీపీ అరాచక పాలన అంతమై నూతన నాయకత్వం రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. తొలుత బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు షేక్ ఖాజావలి నేతృత్వంలో గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన పలువురు మహిళలు గులాబీ కండువా కప్పుకున్నారు.ఖాజావలి మాట్లాడుతూ ఎపిలోని అన్నీ రాజకీయపార్టీలు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి కొమ్ముకాస్తు రాష్ట్రాభివృద్దిని గాలికొదిలేశాయని ఆరోపించారు.

తమ అధినేత తోట చంద్రశేఖర్ నేతృత్వంలో రాష్ట్రంలో బి ఆర్ ఎస్ బలమైన శక్తిగా ఎదిగి రానున్న ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ షాకీర్ వేముల కోటమ్మ షేక్ ఖాసింబి షేక్ మస్తాన్ బి కే లక్ష్మి అంకమ్మ,ముస్లిం హక్కుల పోరాట సమితి,బి ఆర్ ఎస్ నాయకులు షేక్ సిరాజ్, అన్వర్,షేక్ షాకీర్,షేక్ యాసిన్ బాబా,పి. ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: Raja Singh Reaction: రజాకార్ మూవీపై కేటీఆర్ ట్వీట్, దిమ్మదిరిగే రిప్లై ఇచ్చిన రాజాసింగ్!