Site icon HashtagU Telugu

YCP Leaders: వైసీపీ ఘోర ఓట‌మికి కార‌ణ‌మైన ఆ ఆరుగురు

Ycp (1)

Ycp (1)

YCP Leaders: ప్రజాస్వామ్యం అంటే.. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే పాలించడం… అని అర్థం. కానీ.. ఒక్క ఛాన్స్ ప్లీజ్‌ అంటూ అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ నేత‌లు ప్ర‌జాస్వామ్యానికి అస‌లు అర్ధ‌మే లేకుండా చేశారు. ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌ధానంగా జ‌గ‌న్ ఓడిపోవ‌డానికి రెండే రెండే కార‌ణాలు. ఒక‌టి ఆయ‌న కేవ‌లం సంక్షేమం న‌మ్ముకొని ప్ర‌జ‌ల‌కు దూరంగా ఉన్నార‌నే అప‌వాదును తెచ్చుకున్నారు. రెండోది… అయ‌న క్యాబినెట్ లో ఉన్న మంత్రులు ప‌దే ప‌దే ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌ను విమ‌ర్శించ‌డం ప‌నిగా పెట్టుకున్నారు.. ముఖ్యంగా వైసీపీ పార్టీలో ఓ ఆరుగురు మాత్రం త‌మ బాధ్య‌త‌ల‌ను మ‌రిచిపోయి తిట్ట‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు. ఆ ఆరుగురు ఎవ‌రంటే కొడాలి నాని, అంబ‌టి రాంబాబు, రోజా సెల్వ‌మ‌ణి, పేర్ని నాని, జోగు ర‌మేశ్, అనిల్ కుమార్‌.

టూరిజం మినిస్ట‌ర్ గా చేసిన రోజా ఎంతోమందికి టీడీపీ ద‌ర్శ‌నం చేయించి ప్ర‌జ‌ల నుంచి డ‌బ్బులు కాజేసింద‌నే విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి. సీన్ క‌ట్ చేసి జ‌గ‌న్ ఓడిపోవ‌డానికి త‌న‌వంతు క్రుషి చేసింద‌ని ప్ర‌జ‌ల అభిప్రాయం. ఇక ఏదైనా ప్రెస్ మీట్ పెడితే స‌బ్జెక్టును ప‌క్క‌న పెట్టి అన‌వ‌సర‌ ఆరోప‌ణ‌లు చేయ‌డం అంబ‌టి రాంబాబుకు అల‌వాటు. ఈ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఓడించ‌డానికి ప్ర‌ధాన కార‌కుల్లో అంబ‌టి రాంబాబు ఒక‌రు.

ఇక కొడాలి నాని కూడా టీడీపీ నాయ‌కుల‌ను తిట్ట‌డ‌మే ప‌నిగా పెట్టుకోవ‌డం, ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గం గురించి పూర్తిగా మ‌రిచిపోయాడు. ఇక జోగి ర‌మేశ్ సైతం జ‌గ‌న్ దేవుడు.. శూరుడు అంటూనే.. చంద్ర‌బాబుపై అనేక ఆరోప‌ణ‌లు చేశాడు. ఈ ఎన్నిక‌లకు ముందు జ‌గ‌న్ చేత మెప్పు పొంద‌డం కోసం చంద్ర‌బాబు ఇంటి వ‌ద్ద ధ‌ర్నాకు వెళ్లి తీవ్ర విమ‌ర్శ‌ల పాల‌య్యాడు. ఇక అనిల్ కుమార్, పేర్ని నానికూడా వైసీపీ ఓట‌మికి కార‌ణ‌మ‌య్యారు.