AP Congress : ఏపీలో కాంగ్రెస్‌కు ఆశాదీపంలా ఆ 2 నియోజకవర్గాలు

AP Congress :  ఆంధ్రప్రదేశ్‌లో పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతోంది.

  • Written By:
  • Updated On - May 9, 2024 / 09:02 AM IST

AP Congress :  ఆంధ్రప్రదేశ్‌లో పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. వైఎస్ షర్మిల నాయకత్వంలో హస్తం పార్టీకి ఈసారి ఎన్నికల వేళ కొంత ఊపు వచ్చింది. ఉమ్మడి ఏపీ విభజన తర్వాత చాలావరకు కాంగ్రెస్ క్యాడర్ వైఎస్ జగన్ వెంట వైఎస్సార్ సీపీలోకి వెళ్లిపోయింది. దీంతో కాంగ్రెస్ డీలా పడింది. ఫలితంగా 2014, 2019 ఎన్నికల్లో పేలవమైన ఫలితాలే కాంగ్రెస్‌కు మిగిలాయి. పదేళ్ల గ్యాప్ తర్వాత ఏపీలో కాంగ్రెస్‌కు(AP Congress)  మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. పలు అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ బలమైన అభ్యర్థులను బరిలోకి దింపింది. ఈ జాబితాలోకే ఉమ్మడి అనంతపురం జిల్లాలోని శింగనమల,  మడకశిర అసెంబ్లీ స్థానాలు వస్తాయి. హస్తం పార్టీకి ఆశలు పెంచుతున్న ఆ రెండు సీట్లపై ఫోకస్.

We’re now on WhatsApp. Click to Join

శింగనమల

  • శింగనమల.. ఇది ఉమ్మడి అనంతపురం జిల్లాలోని  ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ స్థానం.
  • ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున మాజీ మంత్రి శైలజానాథ్ పోటీ చేస్తున్నారు.
  • గతంలో ఈయన ఇదే స్థానం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
  • ఇక్కడ టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది.
  • శింగనమల నుంచి వైఎస్సార్ సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా జొన్నలగడ్డ పద్మావతి ఉన్నారు. అయితే ఈసారి ఇక్కడ  అభ్యర్థిని మార్చాల్సిందే అని సీఎం జగన్ స్పష్టం చేశారు. దీంతో పద్మావతి భర్త సాంబశివారెడ్డి తాము చెప్పిన వారికే  టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. చివరకు తన వద్ద టిప్పర్ డ్రైవర్‌గా పని చేస్తున్న వీరాంజనేయులుకు అసెంబ్లీ టికెట్ ఇప్పించుకున్నారు. వీరాంజనేయులుపై సాంబశివారెడ్డే పెత్తనం చేస్తారు. ఈవిషయం నచ్చక స్థానిక వైఎస్సార్ సీపీ క్యాడర్ ఈసారి ఆయనకు దూరంగా ఉంటున్నారు.
  • టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణికి కూడా సొంతపార్టీలో వ్యతిరేకత ఉంది. ఆమె అభ్యర్థిత్వాన్ని తొలుత చాలామంది స్థానిక నేతలు వ్యతిరేకించారు. చివరకు చంద్రబాబు ఆదేశం మేరకు కలిసి పనిచేయడం మొదలుపెట్టారు.
  • ఈ పరిస్థితుల నడుమ ఏ రకంగా చూసుకున్నా.. కాంగ్రెస్ అభ్యర్థి శైలజానాథ్‌కు సానుకూల పవనాలు వీస్తున్నాయి.

Also Read :AP Elections – Hyderabad : ఖాళీ అవుతున్న హైదరాబాద్.. ఏపీ ఎన్నికల ఎఫెక్ట్

మడకశిర   

  • మడకశిర.. ఇది ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఈ అసెంబ్లీ స్థానంలో ఎస్సీ, బీసీ ఓటర్లే కీలకం.
  • మడకశిరలో కర్ణాటక ప్రభావమున్న  ఒక్కలిగ సామాజిక వర్గం ఓటర్లు 50 వేల మంది దాకా ఉన్నారు.
  • మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌ను ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపింది.
  • ఈయనకు మద్దతుగా పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి ముమ్మర ప్రచారం చేస్తున్నారు.
  • కర్ణాటక కాంగ్రెస్ నాయకులతో రఘువీరారెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. వక్కలిగ ఓటర్లను ఆకట్టుకునేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌‌‌ను మడకశిరకు పిలిచి ఎన్నికల ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
  • 2009 నియోజకవర్గాల పునర్విభజనకు ముందు బీసీ వర్గానికి చెందిన మాజీ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి వరుసగా మూడుసార్లు మడకశిర నుంచి గెలిచారు. మడకశిర అసెంబ్లీ స్థానం మరో వర్గానికి రిజర్వ్ కావడంతో ఆయన కల్యాణదుర్గం స్థానానికి మారిపోయారు.
  • అధికార వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా సర్పంచ్ ఈర లక్కప్ప పోటీ చేస్తున్నారు. రెండు దశాబ్దాల కిందట ఈయన ఉపాధి కూలీగా పని చేశారు. తర్వాత సర్పంచ్‌ అయ్యారు.
  • ప్రతిపక్ష టీడీపీ కూటమి అభ్యర్థిని మార్చి ఎమ్మెస్ రాజును తెరపైకి తెచ్చింది.

Also Read :Air India Express: ప్ర‌యాణీకులకు చుక్క‌లు చూపిస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌.. 90 కంటే ఎక్కువ విమానాలు ర‌ద్దు..!