CM Jagan Tweet: ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ మే 13 (సోమవారం) ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఏపీలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో 81 శాతం పోలింగ్ నమోదై రికార్డు బ్రేక్ చేసింది. మొన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న నేతలు ఇప్పుడు కాస్త రిలీఫ్ మోడ్‌లో ఉన్నారు. ఈ క్రమంలోనే పార్టీలో పని చేసిన కార్యకర్తలకు, ముఖ్య నాయకులకు, మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు. ఎన్నికల ముగియకముందే చంద్రబాబు, పవన్ కల్యాణ్ తమ కార్యకర్తలకు, మద్దతుదారులకు కృతజ్ఞతలతో పాటు కూటమిదే విజయం అని చెప్పుకొచ్చారు.
అయితే తాజాగా ఎన్నికల అనంతరం ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అది కూడా ఎక్స్ వేదికగా ఈరోజు ఒక ట్వీట్ (CM Jagan Tweet) చేశారు. ఆయన ట్వీట్‌లో ప్రతి ఒక్కరిన్నీ నా అని సంబోధించారు. అయితే ఎన్నికల అనంతరం జగన్ చేసిన ఈ ఫస్ట్ ట్వీట్ ప్రస్తుతం ఎక్స్‌లో తెగ వైరల్ చేస్తుంది. ఈ ట్వీట్‌లో ఆయన మరోసారి వైసీపీ అధికారంలోకి రాబోతుందని ఇన్ డైరెక్ట్‌గా చెప్పారు. ఇప్పటివరకు పాలన ఎలా సాగిందో తర్వాత కూడా పాలన అలాగే కొనసాగిస్తానని సీఎం జగన్ ట్వీట్‌లో రాసుకొచ్చారు.
Also Read: High Tension : తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం
నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలు సైతం లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన నా అవ్వతాతలకు, నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు, నా యువతీయువకులందరికీ పేరుపేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు… pic.twitter.com/RQcsHZqWEO
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 14, 2024
సీఎం జగన్ ట్వీట్‌లో ఏం రాసుకొచ్చారంటే.. “నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలు సైతం లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన నా అవ్వతాతలకు, నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు, నా యువతీయువకులందరికీ పేరుపేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన వైసీపీ పార్టీ గెలుపుకోసం చెమటోడ్చి శ్రమించిన నా కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పటివరకు సాగిన మన సుపరిపాలన, మరింత మెరుగ్గా కొనసాగుతుందని హమీ ఇస్తున్నాను” అని సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. అయితే సీఎం జగన్ చేసిన ఈ ట్వీట్‌పై పలు రకాల కామెంట్లు వస్తున్నాయి. మే 15 నుంచి మే 30వ తేదీ వరకు జగన్ లండన్ టూర్ వెళ్తున్న విషయం తెలిసిందే. తన కూతుర్ల కోసం జగన్ ఈ టూర్ వెళ్తున్నట్లు తెలుస్తోంది.
We’re now on WhatsApp : Click to Join