ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ విప్లవానికి దారితీస్తున్న కృత్రిమ మేధస్సు (AI) రంగంలో భారతదేశం మరో కీలకమైన అడుగు వేసింది. విశాఖపట్నంలో గూగుల్‌తో కలిసి దేశంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్ నిర్మాణానికి అదానీ గ్రూప్ భాగస్వామ్యమవుతోంది. ఈ సందర్భంగా అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ సోషల్ మీడియాలో స్పందిస్తూ, “ఇది భారత చరిత్రలో నిలిచిపోయే రోజు” అని పేర్కొన్నారు. విశాఖలో నిర్మించబోయే ఈ సెంటర్ కేవలం సాంకేతిక మౌలిక వసతిగా కాకుండా, భారత AI విప్లవానికి పునాది రాయిగా నిలుస్తుందని ఆయన అన్నారు.
SIT Inspections : మిథున్ రెడ్డి నివాసాల్లో సిట్ తనిఖీలు
గౌతమ్ అదానీ తన ట్వీట్‌లో, ఈ AI హబ్ దేశంలోని కీలక రంగాలకు విద్య, వ్యవసాయం, ఫైనాన్స్, ఆరోగ్యం, పారిశ్రామిక ఉత్పత్తి వంటి విభాగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావగలదని పేర్కొన్నారు. ఆయన ప్రకారం, గూగుల్‌తో కలిసి నిర్మించబోయే ఈ డేటా సెంటర్ AI ఆధారిత పరిష్కారాలను అందించే సమగ్ర ఎకోసిస్టమ్‌గా రూపుదిద్దుకోనుంది. డేటా ప్రాసెసింగ్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, రియల్ టైమ్ ఇన్‌సైట్స్ వంటి సేవలను ఈ కేంద్రం అందించనుంది. విశాఖను సాంకేతికంగా బలపరచడమే కాకుండా, భారత యువతకు ఆధునిక నైపుణ్యాలపై శిక్షణ, ఉపాధి అవకాశాలు కూడా కల్పించనున్నట్లు అదానీ పేర్కొన్నారు.
“AI రెవల్యూషన్‌కు తోడ్పడే ఇంజిన్ను నిర్మించడం గౌరవంగా భావిస్తున్నాం” అంటూ గౌతమ్ అదానీ గర్వాన్ని వ్యక్తం చేశారు. గూగుల్, అదానీ గ్రూప్‌ల భాగస్వామ్యం భారతదేశాన్ని గ్లోబల్ టెక్ మ్యాప్‌పై మరింత బలంగా నిలబెడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా, మొత్తం దక్షిణ భారతదేశం టెక్ హబ్‌గా అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. విశాఖలో నిర్మించబోయే ఈ AI డేటా సెంటర్, దేశ సాంకేతిక స్వావలంబన దిశగా ఒక చారిత్రాత్మక అడుగుగా, “మేడ్ ఇన్ ఇండియా – డ్రైవన్ బై AI” అనే కొత్త దశను ప్రారంభిస్తుందని ఆయన పేర్కొన్నారు.
