Tirumala : తిరుమలకు మూడో ఘాట్ రోడ్‌…

  • Written By:
  • Updated On - January 19, 2022 / 07:30 PM IST

కడప జిల్లాలోని రైల్వే కోడూరు నుంచి తిరుమ‌ల కొండపైకి మూడో ఘాట్‌ రోడ్డు నిర్మించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. కడప వైపు నుండి అన్నమయ్య మార్గంగా పిలువబడే ట్రెక్కింగ్ మార్గాన్ని తిరుమలకు మూడవ ఘాట్ రోడ్డుగా అభివృద్ధి చేయనున్నారు.తిరుమలకు ఇప్పటికే ఉను రెండు ఘాట్‌ రోడ్లకు అదనంగా మూడో ఘాట్‌ రోడ్డు నిర్మించే విషయం పరిశీలిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మ‌న్‌ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. ఈ ఘాట్‌ రోడ్డు నిర్మాణ సాధ్యాసాధ్యాలపై పరిశీలించి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. అన్నమయ్య మార్గంగా దీని పిలుస్తున్నారని, ఈ మార్గాన్ని నడక మార్గంగా కూడా అభివృద్ధి చేయాలని తీర్మానించామని చెప్పారు.

ప్రస్తుతం అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో పాదచారులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రెండో ఘాట్ రోడ్డు కొండచరియలు విరిగిపడటంతో భారీ నష్టం వాటిల్లింది. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు తిరుమలకు రాకపోకలు సాగించడంతోపాటు ప్రమాదాలను నివారించే విధంగా మూడో ఘాట్‌ రోడ్డును నిర్మించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. అంతేకాకుండా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి 13, 2022 నుండి 10 రోజుల పాటు వైకుంఠ‌ లేదా ఉత్తర ద్వార దర్శనాన్ని అనుమతించాలని టిటిడి నిర్ణయించింది. కొత్త సంవత్సరం నుండి దర్శన టిక్కెట్ల జారీని పెంచాలని ప్రతిపాదించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకారుల కాలనీల్లోని దేవాలయాల వద్ద కూడా ఇలాంటి ఏర్పాట్లు చేయనున్నారు. ఆకాశ గంగ ప్రాంతంలోని అంజనా దేవి ఆలయ ప్రాంగణాన్ని హనుమాన్ జన్మస్థలంగా ప్రకటించి, యాత్రికుల కోసం అభివృద్ధి చేయాలని టీటీడీ బోర్డు నిర్ణ‌యం తీసుకుంది.