Electricity Charges : విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో విద్యుత్ ఛార్జీల పెంపు అంశంపై వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. ఇంధన సర్దుబాటు ఛార్జీల పాపం వైసీపీ అధినేత జగన్‌దేనని ఆరోపించారు. ఆయన ఐదేళ్ల పాలనలో విద్యుత్ రంగంలో చేసిన పాపాలే ఇప్పుడు ఇంధన సర్దుబాటు ఛార్జీల రూపంలో ప్రజలకు ఉరితాళ్లయ్యాయని విమర్శించారు. జగన్ హయాంలో విద్యుత్ రంగంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో ప్రజలు ఇంధన సర్దుబాటు ఛార్జీలు కట్టాల్సి వస్తోందని మంత్రి రవికుమార్ ఆరోపించారు. విద్యుత్ ఛార్జీలు వాళ్లే పెంచి, వాళ్లే ధర్నాలు చేసి, వాళ్లే ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని అన్నారు. పీపీఏలను రద్దు చేయడం, ఏపీ జెన్‌కోను దెబ్బతీయడం, ప్రజావసరాల పేరుతో ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక రేట్లకు విద్యుత్ కొనుగోలు చేయడం వంటి చర్యలు ప్రజలకు భారంగా మారాయని తెలిపారు.
Read Also: RTC : మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు : ప్రభుత్వం ఉత్తర్వులు జారీ !
డిస్కంలు ఇంధన సర్దుబాటు ఛార్జీల వసూళ్లకు ఈఆర్సీకి ప్రతిపాదించినప్పటికీ, 2024 ఎన్నికల వేళ వీటిని వసూలు చేస్తే, నాటి వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని వాయిదా వేశారని మంత్రి రవికుమార్ తెలిపారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని వసూలు చేసేందుకు అనుమతించారని ఆయన ఆరోపించారు. జగన్ హయాంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో ప్రజలు సర్దుబాటు ఛార్జీలు కట్టాల్సి వస్తోందని, 2023-24 సంవత్సరానికి మరో రూ.11,826 కోట్ల భారం ప్రజలపై పడబోతోందని మంత్రి రవికుమార్ పేర్కొన్నారు. ఇక, ఈ వేసవి కాలంలో రోజువారీ విద్యుత్ వినియోగం 260 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుందని అంచనాలున్నాయి.
ముందస్తు ప్రణాళికలతో విద్యుత్ సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలి అని మంత్రి సూచించారు.పెరుగుతున్నవిద్యుత్ వినియోగ డిమాండ్‌ను తీర్చడానికి ప్రత్యామ్నాయంగా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని, ముఖ్యంగా సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు చేపట్టాలి. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 22,709 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చింది. డిమాండ్ మేరకు రైతులకు అవసరమైనన్ని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడానికి అధికారులు సిద్దంగా ఉండాలి. వేసవి కాలంలో ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేలా కనెక్షన్ల ప్రాసెసింగ్ వేగవంతం చేయాలి అన్నారు. అలాగే ఆర్డీఎస్‌ఎస్ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ పంపిణీ సామర్థ్యాలను పెంచుకోవడం, నష్టాలను తగ్గించడం, సబ్ స్టేషన్లు, ట్రాన్స్ మిషన్ నెట్వర్కలను ఆధునీకరించడంపై అధికారులు ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు.
Read Also: INDvAUS : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా