గతంలో తుపాన్లు వస్తే భారీ ప్రాణనష్టం, పశువుల నష్టం, ఆస్తి నష్టం జరుగుతుండేది. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రకృతి వైపరీత్యాలను ఆపలేము కానీ వాటి ప్రభావాన్ని తగ్గించడం మాత్రం సాధ్యమవుతోంది. ఈ సారి మొంథా పేరుతో బే ఆఫ్ బెంగాల్‌లో రూపుదాల్చిన సూపర్ సైక్లోన్ అక్టోబర్ 28న ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటుతూ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిపించింది. అయినప్పటికీ, పూర్వం లాగే ప్రాణనష్టం పెద్దగా లేకపోవడం ప్రజలకు పెద్ద ఉపశమనంగా మారింది. ఇది భారతదేశం విపత్తు నిర్వహణలో అభివృద్ధి చెందిన దేశాల స్థాయికి చేరుకుంటున్నదనే స్పష్టమైన సంకేతం.
Jamaica Floods: జమైకాలో కుంభవృష్టి..ప్రమాదంలో వేలాదిమంది
మొంథా తుఫాన్‌కి 5-6 రోజుల ముందే వాతావరణ శాస్త్రవేత్తలు స్పష్టమైన హెచ్చరికలు ఇచ్చారు. ఈ సమాచారం అందిన వెంటనే ముఖాముఖీ పరిస్థితులను అంచనా వేసి, సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు చర్యలను వేగవంతం చేసింది. కోస్తా ప్రాంతాల్లోని తక్కువ ఎత్తున్న ప్రాంతాల నుంచి సుమారు 75,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సుమారు 469 మండలాలను ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి, 3.6 కోట్ల మందికిపైగా మొబైల్ అలర్ట్స్ పంపించడం ద్వారా ప్రజలను అప్రమత్తం చేశారు. మత్స్యకారులకు సముద్రంలోకి వెళ్లొద్దని సకాలంలో సూచించడం వల్ల ప్రమాదాలు పూర్తిగా తగ్గాయి. ప్రజలు కూడా ప్రభుత్వ సూచనలను కచ్చితంగా పాటించడం ఒక పెద్ద కారణం.
Banana-Milk: రాత్రిపూట పాలు,అరటిపండు కలిపి తీసుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
మరోవైపు వేలాదిగా అంబులెన్స్‌లు, వైద్య సిబ్బంది, NDRF బృందాలు సిద్ధంగా ఉండటం, అవసరమైన ప్రాంతాల్లో వెంటనే రక్షణ చర్యలు చేపట్టేందుకు JCBలు, చెట్లు తొలగించే యంత్రాలను ముందుగానే నిల్వ చేయడం జరిగింది. రెండు దశాబ్దాల కిందటనే ఏర్పాటు చేసిన నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) పాత్ర కూడా గణనీయంగా పెరిగింది. 1977లో దివి సీమ తుపానులో ప్రాణ నష్టం 15,000 దాటిన దుర్ఘటన నుంచి పాఠాలు నేర్చుకొని, ఈరోజు తుపాన్లు వచ్చినా ప్రజల ప్రాణాలను కాపాడగలుగుతున్నాం. ఈ మార్పు శాస్త్రీయ అభివృద్ధి, సాంకేతికత, సర్కారు చర్యలు, ప్రజల్లో పెరిగిన అవగాహన ఇవన్నీ కలిసి సాధించిన విజయం.
