Site icon HashtagU Telugu

G.O. Ms. No. 47 : జీవో ఎంఎస్ నెం 47 ఉపసంహరణ కారణాలు ఇవే..

Go37

Go37

గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం (YCP Govt) అడ్డగోలుగా విడుదల చేసిన జీవోల్లో G.O. Ms. నం. 47 ఒకటి. నిబంధనలు ఉల్లంఘిస్తూ ఏర్పాటు చేసిన వక్ఫ్ బోర్డు నియామకాలు రాష్ట్రంలో అత్యంత వివాదాస్పదంగా మారాయి. G.O. Ms. నం. 47కు వ్యతిరేకంగా కోర్టులో 13 రిట్ పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ముస్లిం మైనారిటీలలో ముఖ్యమైన సున్నీలు, షియాలకు వక్ఫ్ బోర్డులో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. మాజీ ఎంపీలను బోర్డులో చేర్చుకోవాల్సి ఉన్నా, వారిని సైతం పూర్తిగా విస్మరించడం , బార్ కౌన్సిల్ కేటగిరీ నుంచి సరైన ప్రమాణాలు పాటించకుండానే జూనియర్ న్యాయవాదులను ఎంపిక చేశారు.

ఇది కేసులు దాఖలు చేసిన సీనియర్ న్యాయవాదులతో పరస్పర వివాదాలకు దారితీసింది. షేక్ ఖాజా, ముతవల్లిగా ఎన్నిక కావడానికి గల అర్హతపైనా పలు అభ్యంతరాలు-ఆరోపణలు వచ్చాయి. దీనికి తోడు వివిధ కోర్టుల్లో కేసుల కారణంగా చైర్మన్ ఎన్నిక జరగలేదు. మార్చి 2023 నుంచి వక్ఫ్ బోర్డు కార్యాకలపాలు సైతం స్తంభించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్‌ చైర్‌పర్సన్ ఎన్నికపైనా హైకోర్టు స్టే విధించింది. వక్ఫ్ బోర్డు దీర్ఘకాలికంగా పనిచేయక పోవడం, దాని చట్టబద్ధతను ప్రశ్నిస్తూ రిట్ పిటిషన్లు పెండింగ్‌లో ఉండటంతో ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వక్ఫ్ బోర్డుపై దాఖలైన వ్యాజ్యాలను పరిష్కరించడానికి, పాలనా కార్యకలాపాలు యథావిధిగా కొనసాగించడానికి G.O.Ms. నెం.47ను ఉపసంహరించుకుంటూ G.O.Ms. నెం.75ని 30-11-2024న విడుదల చేసింది. G.O.Ms. నెం.47 జారీతో తలెత్తిన వివాదంపై హైకోర్టు చేసిన సూచనలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకుంది. వక్ఫ్ బోర్డులో పాలన సజావుగా కొనసాగించడానికి, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం G.O.Ms. నెం.47 ఉపసంహరణ ద్వారా ప్రభుత్వం భరోసా ఇస్తోంది. అన్ని నిబంధనలతో ప్రభుత్వం త్వరలో కొత్త వక్ఫ్ బోర్డ్ ఏర్పాటు చేస్తుంది.

Read Also : Meenakshi Chaudhary : ఇక నుంచి అలాంటి పాత్రలు చేయంటున్న మీనాక్షి..!

Exit mobile version