AP Trains Halting : స్పెషల్ ట్రైన్లు రయ్ రయ్.. ఏపీలో హాల్టింగ్స్ ఇవే

AP Trains Halting :  రైలు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడపనుంది.

  • Written By:
  • Updated On - April 6, 2024 / 09:00 AM IST

AP Trains Halting :  రైలు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడపనుంది. వీటిలో కొన్ని స్పెషల్ ట్రైన్లకు ఆంధ్రప్రదేశ్‌లోని పలు రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ ఇచ్చారు. ఇంతకీ ఆ స్పెషల్ ట్రైన్స్ ఏమిటి ? హాల్టింగ్ స్టేషన్స్(AP Trains Halting) ఏమిటి ? ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

  • చెన్నై- భువనేశ్వర్‌, ఎర్నాకుళం-బ్రహ్మపుర, చెన్నై ఎగ్మోర్‌-సంత్రాగచ్చి రూట్లలో మూడు ప్రత్యేక రైళ్లను రైల్వేశాఖ నడపనుంది. పెరిగిన ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ రైళ్లను నడిపించనున్నారు.
  • ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ – భువనేశ్వర్‌ (06073) ప్రత్యేక రైలు మే 6, 13, 20, 27, జూన్‌ 3 తేదీల్లో అర్ధరాత్రి 11.45 గంటలకు చెన్నైలో బయలుదేరి తరువాత రోజూ  ఉదయం 11.15 గంటలకు దువ్వాడకు చేరుకుంటుంది.
  • భువనేశ్వర్‌-చెన్నై సెంట్రల్‌ (06074) ప్రత్యేక రైలు మే 7, 14, 21, 28, జూన్‌ 4 తేదీల్లో రాత్రి 9గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరి తరువాత రోజు తెల్లవారుజామున 3.42 గంటలకు దువ్వాడకు చేరుకుంటుంది.
  • ఎర్నాకుళం-బ్రహ్మపుర, చెన్నై ఎగ్మోర్‌-సంత్రాగచ్చి  రూట్లలోనూ దువ్వాడ మీదుగా అన్‌ రిజర్వుడ్‌ ప్రత్యేక రైళ్లను నడపనున్నారు.
  • ఎర్నాకుళం-బ్రహ్మపుర అన్‌రిజర్వుడ్‌ ప్రత్యేక రైలు (06087) ఏప్రిల్‌ 6, 13, 20, 27, మే 4, 11, 18, 25 తేదీల్లో రాత్రి 11గంటలకు ఎర్నాకుళంలో బయలుదేరి తర్వాతి రోజు రాత్రి 11.05 గంటలకు దువ్వాడకు వస్తుంది. అక్కడి నుంచి 11.07గంటలకు బయలుదేరి వెళుతుంది.
  • బ్రహ్మపుర-ఎర్నాకుళం అన్‌రిజర్వుడ్‌ ప్రత్యేక రైలు (06088) ఏప్రిల్‌ 8, 15, 22, 29, మే 6, 13, 20, 27 తేదీల్లో మధ్యాహ్నం 12.40గంటలకు బ్రహ్మపురలో బయలుదేరి సాయంత్రం 6.05గంటలకు దువ్వాడకు వస్తుంది. అక్కడి నుంచి 6.07 గంటలకు బయలుదేరుతుంది.
  • ఎర్నాకుళం-బ్రహ్మపుర రూట్లో నడిచే అన్‌రిజర్వుడ్‌ ప్రత్యేక రైలు 22 జనరల్‌ సెకండ్‌ క్లాస్‌, 2 సెకండ్‌ క్లాస్‌ లగేజీ/డిజేబుల్డ్‌ బోగీలతో ఉంటుంది.

Also Read : Free Blue Tick : ‘ఎక్స్‌’లో మళ్లీ బ్లూటిక్ ఫ్రీ.. షరతులు వర్తిస్తాయి !

  • చెన్నై ఎగ్మోర్‌ – సంత్రాగచ్చి అన్‌రిజర్వుడ్‌ ప్రత్యేక రైలు (06077) ఈనెల 13, 20, 27, మే 4, 11, 18, 25 తేదీల్లో రాత్రి 11 గంటలకు చెన్నై ఎగ్మోర్‌ నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.54 గంటలకు దువ్వాడకు చేరుకుంటుంది. మళ్లీ అక్కడి నుంచి మధ్యాహ్నం 1.59గంటలకు బయలుదేరి వెళుతుంది.
  • సంత్రాగచ్చి-చెన్నై ఎగ్మోర్‌ (06078) అన్‌రిజర్వుడ్‌ ప్రత్యేక రైలు ఈనెల 15, 22, 29, మే 6, 13, 20, 27 తేదీల్లో ఉదయం 10గంటలకు సంత్రాగచ్చిలో బయలుదేరి అర్ధరాత్రి దాటిన తర్వాత 1.48గంటలకు దువ్వాడ చేరుకుని.. అక్కడి నుంచి 1.50 గంటలకు వెళుతుంది.
  • చెన్నై ఎగ్మోర్‌ – సంత్రాగచ్చిఅన్‌రిజర్వుడ్‌ ప్రత్యేక  రైలులో 21 జనరల్‌ సెకండ్‌ క్లాస్‌, 2 సెకండ్‌ క్లాస్‌ లగేజీ/డిజేబుల్డ్‌ బోగీలు ఉంటాయి.

Also Read :Pawan Kalyan : పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌‌కు ఇల్లు.. అద్దె తెలిస్తే షాకవుతారు!

6 వేసవి రైళ్లను మరికొన్ని ట్రిప్పులు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వేశాఖ అధికారులు ఇటీవల వెల్లడించారు. ఈ మార్పు ప్రకారం.. కాచిగూడ నుంచి తిరుపతికి ప్రతి గురువారం వెళ్లే ప్రత్యేక రైలు (07653)  మే 1 వరకు.. తిరుపతి-కాచిగూడ (07654) ప్రత్యేక రైలు మే 2 వరకు నడుస్తుంది. సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ రైలు (07170)ను ఏప్రిల్‌ 27 వరకు, నర్సాపూర్‌-సికింద్రాబాద్‌ రైలు (07169)ను ఏప్రిల్‌ 28 వరకు పొడిగించారు.