ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 10 జిల్లాలకు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులు (డీసీసీబీ) మరియు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీలు (డీసీఎంఎస్) ఛైర్మన్లను (DCCB Chairman) నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా నియమితులైన వారు త్వరలో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. సహకార రంగ అభివృద్ధికి, వ్యవసాయదారుల సంక్షేమానికి ఈ నియామకాలు దోహదపడతాయని ప్రభుత్వం పేర్కొంది.
Box Office : నాని – సూర్య బిగ్ ఫైట్ ..మరి హిట్ కొట్టేది ఎవరో..?
సహకార సంస్థల వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే ఈ నియామకాల ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. నూతనంగా నియమితులైన ఛైర్మన్లు సహకార బ్యాంకుల ద్వారా రైతులకు అవసరమైన రుణ సదుపాయాలు, మార్కెటింగ్ సౌకర్యాలను మెరుగుపరచడంపై దృష్టి సారించనున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా సహకార రంగం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది.
డీసీసీబీ చైర్మన్లు వీళ్లే..
▪️శ్రీకాకుళం – శివ్వల సూర్యనారాయణ (తెదేపా),
▪️విశాఖ – కోన తాతారావు (జనసేన)
▪️విజయనగరం – కిమిడి నాగార్జున (తెదేపా)
▪️గుంటూరు – మాకినేని మల్లికార్జునరావు (తెదేపా)
▪️కృష్ణా – నెట్టెం రఘురామ్ (తెదేపా)
▪️నెల్లూరు – ధనుంజయరెడ్డి (తెదేపా)
▪️చిత్తూరు – అమాస రాజశేఖర్రెడ్డి (తెదేపా)
అనంతపురం – కేశవరెడ్డి (తెదేపా)
▪️కర్నూలు – డి. విష్ణువర్ధన్రెడ్డి (తెదేపా)
▪️కడప – బి.సూర్యనారాయణ (తెదేపా)
డీసీఎంఎస్ ఛైర్మన్లు వీళ్లే..
▪️శ్రీకాకుళం – అవినాష్ చౌదరి (తెదేపా)
▪️విశాఖ – కొట్ని బాలాజీ (తెదేపా)
▪️విజయనగరం – గొంప కృష్ణ (తెదేపా)
▪️గుంటూరు – వడ్రాణం హరిబాబు (తెదేపా)
▪️కృష్ణా – బండి రామకృష్ణ (జనసేన)
▪️నెల్లూరు గొనుగోడు నాగేశ్వరరావు (తెదేపా)
▪️చిత్తూరు – సుబ్రమణ్యం నాయుడు (తెదేపా),
▪️అనంతపురం – నెట్టెం వెంకటేశ్వర్లు (తెదేపా)
▪️కర్నూలు – జి. నాగేశ్వరయాదవ్ (తెదేపా)
▪️కడప – యర్రగుండ్ల. జయప్రకాశ్ (తెదేపా)