Site icon HashtagU Telugu

Alliance-Ycp Manifesto: కూటమి-వైసీపీ మేనిఫెస్టోలో తేడాలు ఇవే..!

Allaince Ycp Manifesto

Allaince Ycp Manifesto

 

Alliance-Ycp Manifesto: ఎన్నో ఆశలతో మేనిఫెస్టో ఇచ్చారు. అన్ని పార్టీలు ఇచ్చాక…లాస్ట్ ముమెంట్‌లో మేనిఫెస్టో సీల్డ్ కవర్ ఓపెన్ చేసారు. తీరా చూస్తే…. అందరి దగ్గర్నుంచీ కూడా నెగటివ్ ఓపీనియనే వస్తోంది. ఎందుకంత లేట్ చేయాల్సి వచ్చింది? వైసీపీ మేనిఫెస్టో ప్రజల్లోకి ఎందుకంత భలంగా వెళ్లలేకపోయింది? లెట్స్ రీడ్ దిస్ స్టోరీ?

వాస్తవానికి… మేనిఫెస్టో ప్రకటించడానికి ముందు… వైసీపీ గ్రాఫ్ ఒకలా ఉండేది. కానీ…మేనిఫెస్టో ప్రకటించాక పరిస్థితి పూర్తిగా మారిందనే చెప్పాలి. సోషల్ మీడియాలో కూడా… పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. న్యూట్రల్ ఓటర్లు, మేధావులు, విద్యావంతులు… ఒక రకమైన ఆలోచన చేయడం స్టార్ట్ చేసారు. కనీసం కేంద్రంతో పోరాడి సాధించే విషయాలైనా… మేనిఫెస్టోలో పెట్టలేదన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. కనీసం ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం గురించి… మేనిఫెస్టోలో పొందుపరచలేదు. కడప ఉక్కు పరిస్థితి ఏంటనేది కూడా చెప్పలేదు.

జగన్‌కు సంక్షేమ సామర్థ్యం తగ్గిందన్నది…. ఈ మేనిఫెస్టోని చూస్తే అర్ధం అవుతోంది. ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చినా…. సంక్షేమ పథకాలు అమలు చేయగలదా అన్న అనుమానం వస్తోంది. ఎందుకంటే భారీ సంక్షేమ పథకాలు ఉంటాయని…అందరూ ఎంతో ఆశగా ఎదురు చూసారు. పోనీ ఈసారి సంక్షేమాన్ని పక్కన పెట్టి… అభివృద్ధి చేస్తానని చెప్పే సాహసం కూడా చేయలేదు. అయిందేదో అయింది.. ఈసారి గెలిస్తే మాత్రం తప్పకుండా మెగా డీఎస్సీ ప్రకటిస్తానని, కనీసం ఉద్యోగ క్యాలెండర్ ప్రకటిస్తానని, ఉద్యోగ, ఉపాధ్యాయులను ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా చూసుకుంటానని.. జగన్ చెప్పలేకపోయారు. ఐతే మేనిఫెస్టో ప్రకటనలో ఎంతో ఆలస్యం జరిగింది. దీంతో అందరిలో అంచనాలు పెరిగాయి. కానీ… ప్రజల అంచనాలను అందుకోలేక.. తూతూ మంత్రంగా మేనిఫెస్టో ప్రకటించినట్లు అయింది. ఐతే ఒకటి మాత్రం నిజం. మేనిఫెస్టో ప్రకటన తర్వాత… జగన్ గ్రాఫ్ పడిపోయినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి. ఈ వీడియోపై మీరు ఏమనుకుంటున్నారో మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇటు టీడీపీ మేనిఫెస్టో మాత్రం తీసుకుంటే మాత్రం….ఎలాంటి సందేహాలు లేకుండా ఎంతో క్లియర్‌గా ఉంది. దీంతో అందరూ టీడీపీ మేనిఫెస్టోపై ప్రశంసలు కురిపిస్తున్నారు.