Site icon HashtagU Telugu

RRR : ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే ఛాన్స్ .!!

Rrr Raghurama Krishnam Raju

Rrr Raghurama Krishnam Raju

ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. మూడు రాజధానులకు మద్దతుగా కొందరితో రాజీనామాలు చేయించే అవకాశం ఉందన్నారు. తర్వాత మూకుమ్మడి రాజీనామాలు చేస్తి..అసెంబ్లీని రద్దు చేయడం వంటివి జరుగుతాయని చెప్పారు. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంచనా వేశారు.

వైసీపీ ఈ మూడున్నర ఏళ్లలో మూడు ముక్కలాట ఆడటం తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదంటూ విమర్శించారు. మూడు రాజధానులకు మద్దతుగా రాజీనామా చేసేందుకు సిద్దమని మంత్రి ధర్మాన విప్ కరణం ధర్మశ్రీ ప్రకటించారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి నుంచి అరసవిల్లి వరకు మహాపాదయాత్ర చేపట్టారు. వారికి పోటీగా జేఏసీ ఆధ్వర్యంలో మూడు రాజధానుల ఉద్యమం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీ రఘురామ ఈ వ్యాఖ్యలు చేశారు.