Pawan Biography: అప్పుడు ఓటమి…ఇప్పుడు కింగ్ మేకర్..పవన్ బయోగ్రఫీ

మెగాస్టార్ తమ్ముడిగా పరిశ్రమలో అడుగు పెట్టి... ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్. వరుసగా సినిమాలు ఫెయిల్ అయినా అభిమానులు మాత్రం...

  • Written By:
  • Publish Date - June 12, 2024 / 05:43 PM IST

Pawan Kalyan Biography: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పరిశ్రమలో అడుగు పెట్టి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). వరుసగా సినిమాలు ఫెయిల్ అయినా అభిమానులు మాత్రం ఆయనను వదిలి వెళ్ళలేదు. అన్న చిరంజీవి (Chiranjeevi) స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు పవన్. ఆ పార్టీని తర్వాత కాంగ్రెస్ లో (Congress) కలపడంతో నచ్చక అన్నతో విభేదించాడు.

బాల్యం, విద్యాభ్యాసం
ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లలో (Bapatla) సెప్టెంబర్ 2, 1971న వెంకటరావు-అంజనాదేవి దంపతులకు జన్మించాడు. మెగాసార్ట్ చిరంజీవి పవన్‌కు పెద్దన్నయ్య. నటుడు, నిర్మాత నాగేంద్ర బాబు  (NagaBabu)పవన్‌కు రెండో అన్నయ్య. పవన్ ప్రాథమిక విద్యభ్యాసం (Education) బాపట్లనే సాగింది . తర్వాత నెల్లూరులో (Nellore) ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించారు. ఆ తర్వాత ఇంటర్ నెల్లూరులోని విఆర్ కాలేజీలో (VR Collage) చదువుకున్నాడు. ఆ తర్వాత కంప్యూటర్ డిప్లొమా పూర్తి చేశాడు.

సినీ జీవితం
ఆయనకు పుస్తకాలు చదువడమంటే చాలా ఇష్టం. అప్పటికే చిరంజీవి (Star Hero) స్టార్ హీరోగా ఎదగడంతో సినిమాల్లోకి వెళ్లాలని ఆలోచన వచ్చింది. ఆ విషయాన్ని తన అన్నయ్య చిరంజీవికి (Chiranjeevi) చెప్పారు. సరే నువ్వు నటించు కానీ… ముందు యాక్టింగ్ నేర్చుకో అని.. సత్యం మాస్టార్ దగ్గరికి పవన్ కళ్యాణ్ ని పంపించాడు. ఆయన దగ్గర ఆరు నెలలు నటన నేర్చుకున్నాడు పవన్. వీవీ సత్యనారాయణ (VV Satyanarayana) దర్శకత్వంలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి కథను ఒకే చేసి… 1996 అక్టోబర్ నెలలో విడుదల చేశారు. ఈ సినిమా యావరేజ్ గా (Average Talk) ఆడింది. ఇక 2009లో రేణు దేశాయ్ కు పవన్ కళ్యాణ్ కి (Pawan Kalyan) అధికారికంగా వివాహం చేశారు మెగాస్టార్. తర్వాత 2016లో సర్దార్ గబ్బర్ సింగ్, 2017 లో కాటమరాయుడు, 2018లో అజ్ఞాతవాసి అంతగా ఆడలేవు.

రాజకీయ జీవితం
2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ (Pawan) అహర్నిశలు ప్రచారం చేశాడు. ఆ పార్టీ యువజన నాయకుడుగా ఎటువంటి పదవులు ఆశించకుండా… ఆ ఎన్నికల్లో ప్రచారం చేశాడు. అయితే ఆ ప్రచారంలో ఆవేశంగా మాట్లాడేవారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ (Prajarajyam Party) ఘోరంగా ఓడిపోయింది. దీంతో 2011లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశాడు. దీంతో పవన్ కి (Pawan, Chiru) చిరంజీవికి కాస్త దూరం పెరిగింది. కానీ ఏ రోజు అన్నకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ 2014 మార్చి 14న ఒక్కడే అభిమానులు సమక్షంలో జనసేన పార్టీని స్థాపించాడు జనసేన పార్టీ భావజాలంతో కూడిన ఒక పుస్తకం కూడా రాశాడు.

నరేంద్ర మోడీని కలిసి రెండు తెలుగు రాష్ట్రాల సమస్యల వివరించాడు. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపికి బిజెపికి సపోర్ట్ చేసి టీడీపీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కానీ జనసేన ఒక్క స్థానంలో కూడా పోటీ చేయలేదు. ఇలా పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ నిత్యం ప్రజల మధ్యనే ఉన్నాడు. 2019 ఎన్నికల్లో (General Elections) జనసేన 175 స్థానాలు గాను 140 స్థానాల్లో పోటీ చేసింది.ఈ ఎన్నికల్లో.. పవన్ (Pawan).. భీమవరం (Bhimavaram), గాజువాక (Gajuwaka) రెండు స్థానాల్లోనూ పోటీ చేశాడు. కానీ ఆ రెండు చోట్ల ఓడిపోయాడు మిగతా 138 స్థానాల్లో ఒక తూర్పుగోదావరి జిల్లా రాజోలులో రాపాక వరప్రసాద రావు (Rapaka Vara Prasad) గారు తప్ప ఇంకెవరూ గెలవలేదు.

అయినా కూడా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నిరాశ చెందలేదు. ప్రజల సమస్యలపై తన గళాన్ని వినిపిస్తునే ఉన్నారు. ప్రజల కోసమే తాను పార్టీని స్థాపించాను. కానీ పదవుల కోసం కాదు అని ప్రజల సమస్యల గురించి పట్టించుకున్నాడు. 2020 జనవరి నుంచి బిజెపితో (Bjp) పొత్తు పెట్టుకున్నాడు. 2024 ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీలు కలిసి బరిలో దిగుతున్నాయి. పవన్ కళ్యాణ్ కి (Pawan Kalyan) తెలంగాణ , ఆంధ్ర రాష్ట్రాలలో మంచి ఫాలోయింగ్ (Fallowing) ఉంది. ఫాన్స్ ను ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారు.