AP Theatres: జ‌గ‌న్ స‌ర్కార్ నిబ‌ద్ధ‌త‌పై `ఎగ్జిబిట‌ర్ల` అప‌న‌మ్మ‌కం

ఏపీ సినిమా థియేట‌ర్ల యాజ‌మాన్యాలు, ప్ర‌భుత్వం మ‌ధ్య టిక్కెట్ల ఆన్ లైన్ వ్య‌వ‌హారం మ‌రింత ముదురుతోంది.

  • Written By:
  • Publish Date - June 29, 2022 / 07:40 PM IST

ఏపీ సినిమా థియేట‌ర్ల యాజ‌మాన్యాలు, ప్ర‌భుత్వం మ‌ధ్య టిక్కెట్ల ఆన్ లైన్ వ్య‌వ‌హారం మ‌రింత ముదురుతోంది. ప్ర‌భుత్వం ఆన్ లైన్ పోర్ట‌ల్ ద్వారా విక్ర‌యించిన టిక్కెట్ల ద్వారా వ‌చ్చిన న‌గదును ప్ర‌భుత్వం సకాలంలో ఇస్తుందా? లేదా? అనే సందేహంలో ప‌డిపోయారు. పైగా ఇప్ప‌టికే ప్రైవేటు పోర్ట‌ళ్లు బుక్ మై షో, పేటీఎం, జ‌స్ట్ ఏ టిక్కెట్‌, ఈజీ టిక్కెట్ త‌దిత‌రాల‌తో ఒప్పందాలు కుదుర్చుకున్న వైనాన్ని గుర్తు చేస్తున్నారు. ప్ర‌భుత్వ పోర్ట‌ల్ ద్వారా టిక్కెట్ల‌ను విక్ర‌యించ‌డానికి ఏ మాత్రం థియేట‌ర్ యాజ‌మాన్యాలు ధైర్యం చేయ‌క‌పోవ‌డం విచిత్రం.

ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ అధికారులు ప్రతి థియేటర్ యజమానికి అగ్రిమెంట్ పత్రాలను పంపారు. ఆన్‌లైన్ టిక్కెట్ల అమ్మకంపై 24 గంటల్లోపు అగ్రిమెంట్‌లపై సంతకం చేసి, వాటిపై సమ్మతిని తెలియ‌చేయాల‌ని ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇప్పటికే ప్రైవేటు పోర్టల్‌తో ఒప్పందం చేసుకున్నందున ప్ర‌భుత్వ పేపర్లపై సంతకాలు చేయవద్దని న్యాయ నిపుణులు థియేట‌ర్ యాజ‌మాన్యాల‌కు సూచిస్తున్నారు. ఒక వేళ ప్ర‌భుత్వ ప‌త్రాల‌పై సంత‌కాలు చేస్తే భ‌విష్య‌త్ లో న్యాయపరమైన స‌వాళ్ల‌ను ఎదుర్కోవాల‌ని హెచ్చ‌రిస్తున్నారు.

ప్ర‌భుత్వ ప‌త్రాలపై సంత‌కాలు చేస్తే, ప్రైవేటు పోర్ట‌ళ్ల‌కు ఇచ్చిన అగ్రిమెంట్ ర‌ద్దు అవుతుంది. అందుకుగాను, ఆ పోర్ట‌ళ్ల‌కు వ‌డ్డీతో స‌హా ఆ మొత్తాన్ని థియేట‌ర్ యాజ‌మాన్యాలు చెల్లించాలి. కానీ, ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఎలాంటి చెల్లింపులు చేయ‌లేని ఆర్థిక క‌ష్టాల్లో ఎగ్జిబిటర్లు ఉన్నారని కాకినాడ‌ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సెక్రటరీ జి. శ్రీనివాస్ అంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో, ఎగ్జిబిటర్లు ఎవరైనా నెలకు ₹50,000 చెల్లిస్తే వారి సినిమా హాళ్లను లీజుకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నార‌ని తెలిపారు. ప్ర‌భుత్వ పోర్ట‌ల్ తో ఒప్పందం చేసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతను థియేటర్ యజమానులు ప్ర‌శ్నిస్తున్నారు. అందుకు కొన్ని సంఘ‌ట‌న‌ల‌ను ఉద‌హ‌రిస్తున్నారు. కరోనా సమయంలో థియేటర్ల యజమానులు చెల్లించాల్సిన మూడు నెలల విద్యుత్ బిల్లులను మాఫీ చేస్తూ ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం జీవో జారీ చేసింది. కానీ ఇప్పటి వరకు జిఓ అమలు కాక‌పోవ‌డాన్ని గుర్తు చేస్తున్నారు.

ప్ర‌స్తుతం ప్రైవేటు పోర్ట‌ళ్లు మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే ముందు రోజు క‌లెక్ష‌న్ల మొత్తాన్ని జ‌మ చేస్తున్నాయి. ఆ విధంగా జ‌గ‌న్ స‌ర్కార్ న‌గ‌దు జ‌మ చేస్తుంద‌న్న న‌మ్మ‌కం థియేట‌ర్ యాజ‌మాన్యానికి లేదు. కొన్ని సంద‌ర్బాల్లో టిక్కెట్లు రద్దు చేయబడతాయి. అటువంటి పరిస్థితులలో, ప్రదర్శన రద్దు చేయబడితే, ప్రైవేట్ పోర్టల్‌లు వీక్షకులకు వన్-ప్లస్-వన్ పవర్ వంటి ప్రోత్సాహకాలను అందిస్తాయి. “ప్రభుత్వం అలా చేస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం థియేటర్ల తరపున ఆన్‌లైన్ సినిమా టిక్కెట్లను విక్రయించాలనుకుంటే, ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలి, ”అని ఒక ఎగ్జిబిటర్ అంటున్నారు.
ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎగ్జిబిటర్లతో మంత్రి వేణుగోపాల్ జరుపుతుంద‌ని హామీ ఇచ్చారు. అయిన‌ప్ప‌టికీ ఆర్థిక అంశాల. విష‌యంలో జ‌గ‌న్ స‌ర్కార్ ను న‌మ్మే ప‌రిస్థితుల్లో థియేట‌ర్ యాజ‌మాన్యాలు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.