Site icon HashtagU Telugu

Ganesha Idols : వినాయక మట్టి విగ్రహాల తయారీకి ప్రసిద్ధి ఆ గ్రామం…కానీ పట్టించుకోని ఏపీ ప్రభుత్వం

clay Ganesha idols Gadilanka

clay Ganesha idols Gadilanka

వినాయక చవితి వస్తుందంటే చాలు ఊరు , వాడ , పల్లె , పట్టణం అనే తేడాలేకుండా గణేష్ నవరాత్రులు సిద్ధం అవుతాయి. నెల ముందు నుండే నవరాత్రుల సంబరాలు మొదలుపెడతారు. విగ్రహాన్ని బుక్ చేయడం , చందాలు వసూళ్లు చేయడం, మండపం సిద్ధం చేయడం అబ్బో..నవరాత్రులు వచ్చేదగ్గిరి నుండి పూర్తి అయ్యేవరకు అంత ఆ పనుల్లోనే నిమగ్నమవుతారు. ఇక ఏడాది కూడా అలాగే సందడి నెలకొంది. అయితే ఇక్కడ ఓ గ్రామం మాత్రం దాదాపు కొన్ని ఏళ్ల నుండి మట్టి విగ్రహాలను (Clay Ganesha) తయారు చేస్తూ..జీవనం సాగిస్తున్నారు. అయితే వీరిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారంతా వాపోతున్నారు.

ఏపీ (AP)లోని అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గాడిలంక (Gadilanka) గ్రామం మట్టి విగ్రహాల తయారీకి ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామంలో సుమారు 100 కుటుంబాలు మట్టి విగ్రహాల తయారీపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాయి. ఇక్కడ తయరుచేసే విగ్రహాలకు కేవలం మట్టి, కొబ్బరిపీచు, సహజసిద్దమైన రంగలను మాత్రమే వాడతారు. పర్యావరణానికి హాని ఉండదని నీటిలో సులభంగా కలుగుతాయని తయారీదారులు చెప్పుకొస్తున్నారు. ఈ గ్రామంలో మూడు తరాల క్రితం ఒక్క కుటుంబంతో ప్రారంభమై.. నేడు 100 కుటుంబాలకు విగ్రహాల తయారీకి జీవనాధారంగా మారింది. వినాయక చవితి, దసరా సమయాలలో వినాయకుడు, దుర్గామాత విగ్రహాలు తయారు చేస్తుంటారు. వినాయకచవితి వస్తుందంటే చాలు దూర ప్రాంతాల నుండి వచ్చి కూడా ఇక్కడి నుండి వినాయక మట్టి విగ్రహాలు తీసుకెళ్తుంటారు.

 

Read Also : Singapore: సింగపూర్‌లో అమానుషం, హిందూ దేవాలయంలో మహిళను కొట్టిన లాయర్

అయితే ఈ మద్య కాలంలో ఇతరులు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (plaster of paris) విగ్రహాలు తయారు చేయడంవల్ల తమ‌ మట్టి విగ్రహాలకు గిరాకీ తగ్గిందని వారంతా వాపోతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో మట్టి విగ్రహాల తయారుచేసే వారు తమ ఉపాధిని కోల్పోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మట్టి విగ్రహాల తయారీని కుటీర పరిశ్రమలా గుర్తించి రాయితీపై బ్యాంకుల ద్వారా రుణాలు కల్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. వర్షాలు వస్తే తయారు చేసిన మట్టి బొమ్మలకు భద్రపరిచేందుకు షెడ్లు లేకపోవడంతో తడిసిపోతున్నాయని ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తే షెడ్లు లేక తార్బన్ సౌకర్యాలు అవసరం ఉందటున్నారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి బొమ్మల తయారిచేసే మాకు ప్రభుత్వాలు, నాయకులు గుర్తించి ఆదుకుంటే రాబోయే తరాలకు ఈ హస్తకళ బతికి ఉంటుందని చెపుతున్నారు. మరి వీరి ఆవేదనను ప్రభుత్వం పట్టించుకుంటుందో లేదో..