Site icon HashtagU Telugu

TDP Third List : ఇవాళే టీడీపీ మూడో లిస్ట్.. ఆ స్థానాల్లో ట్విస్టులు !?

Tdp Third List

Tdp Third List

TDP Third List : ఇవాళే టీడీపీ అభ్యర్థుల మూడో లిస్టును పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విడుదల చేయనున్నారు. టీడీపీ తొలి రెండు లిస్టులలోనూ మొత్తం అసెంబ్లీ అభ్యర్థులనే అనౌన్స్ చేసింది. ఈసారి విడుదల చేయబోయే లిస్టులో లోక్‌సభ అభ్యర్థులతో పాటు పెండింగ్ అసెంబ్లీ అభ్యర్థుల పేర్లు కూడా ఉంటాయని తెలుస్తోంది. బీజేపీతో పొత్తులో భాగంగా కేటాయించిన ఎంపీ సీట్లపైన కొత్త అనిశ్చితి ఇంకా కంటిన్యూ అవుతోంది. ఇవాళ ప్రకటించే టీడీపీ అభ్యర్థుల లిస్టులో కొత్త పేర్లు ఉంటాయని అంటున్నారు. తెలుగుదేశంపార్టీ ఫస్ట్ లిస్టులో 94, రెండో లిస్టులో 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు చంద్రబాబు(TDP Third List)  అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join

Also Read :Jio World Garden : అంబానీయా మజాకా.. ‘జియో వరల్డ్ గార్డెన్’ విశేషాలివీ

Also Read :World Water Day 2024 : జలం ఉంటేనే జనం.. ‘బెంగళూరు సంక్షోభం’ నేర్పుతున్నది అదే!