Site icon HashtagU Telugu

Bike Thief : పోలీసులకే సవాల్ విసిరిన దొంగ..కట్ చేస్తే లోకేష్ ట్వీట్

Ap Police Thief

Ap Police Thief

ఏలూరు జిల్లాలో జరిగిన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “దమ్ముంటే పట్టుకో షెకావత్” అనే పుష్ప సినిమా డైలాగ్‌ లా, రియల్ లైఫ్‌లో ఒక దొంగ కూడా పోలీసులకు ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు. ‘నేను వంద బైక్‌లు దొంగతనం చేశా.. పోలీసులు నన్నేమీ చేయలేరు’ అంటూ రెల్లిపేటకు చెందిన దలాయ్ గణేశ్‌ అలియాస్ నాగపవన్ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశాడు. తన స్నేహితులకు పంపిన ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది. అంతేకాదు, వీడియోలో గణేశ్ చేసిన వ్యాఖ్యలు పోలీసులు, ప్రజలలో చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు ప్రజలు నవ్వుకుంటుంటే, మరోవైపు పోలీసులు మాత్రం దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు.

Drinking Water: ‎నీరు తాగిన వెంటనే మూత్ర విసర్జనకు వెళ్తున్నారా.. అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే!

ఇటీవలి రోజులుగా నూజివీడు పరిసర ప్రాంతాల్లో బైక్ దొంగతనాలు పెరిగాయి. పలు ఫిర్యాదులు పోలీసుల దృష్టికి రావడంతో, దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. అదే సమయంలో గణేశ్ వీడియో వైరల్ కావడంతో, దానిని ఆధారంగా తీసుకొని పోలీసులు నిఘా వేశారు. గణేశ్‌తో పాటు ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో షేక్ ఆసిఫుల్లా, చిత్తూరి అజయ్‌కుమార్, షేక్ మెహర్‌బాబా, చౌటపల్లి సుభాష్ ఉన్నారు. వీరి వద్ద నుండి 12 బైక్‌లను సీజ్ చేశారు. పోలీసులు దర్యాప్తులో ఈ ముఠా జల్సాలు, వ్యసనాలకు అలవాటు పడిందని, డబ్బులు సులభంగా సంపాదించడానికి చోరీల మార్గం ఎంచుకున్నారని తేల్చారు.

‎Spiritual: మీకు కూడా ఇలాంటి సంకేతాలు కనిపిస్తున్నాయా.. అయితే రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవ్వడం ఖాయం!

దొంగ గణేశ్ చేసిన సవాల్‌కు ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ స్పందించారు. “నీవు వీడియోలో ఏం అన్నావో ఇక్కడే చెప్పు” అని గణేశ్‌ను ప్రజల ముందే ప్రశ్నించారు. దీనికి గణేశ్ తాను మద్యం మత్తులో అలా మాట్లాడానని, తప్పు చేశానని ఒప్పుకున్నాడు. పోలీసులు ఈ సంఘటనను ఉదాహరణగా చూపిస్తూ, “చట్టాన్ని ఎవరూ సవాలు చేయకూడదు, సవాల్ చేస్తే చట్టం సమాధానం చెబుతుంది” అని హెచ్చరించారు. ఈ సంఘటనపై ఏలూరు పోలీసులు విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. పుష్ప సినిమాలోని డైలాగ్ రీల్‌లో ఎంటర్టైన్ చేసినా, రియల్ లైఫ్‌లో మాత్రం అదే డైలాగ్‌ దొంగకు జైల్లో టికెట్ తెచ్చిపెట్టిందని ప్రజలు కామెంట్లు చేస్తున్నారు.

Exit mobile version