India Republic Day రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రభుత్వం నిర్వహిస్తోంది. రాయపూడి సమీపంలో సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి హైకోర్టుకు వెళ్లే దారిలో 22 ఎకరాల విస్తీర్ణంలో ఘనంగా ఈ వేడుకలు జరుగుతున్నాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలకు సీఎం చంద్రబాబు నాయుడు, సతీమణి నారా భువనేశ్వరి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, పలువురు మంత్రులు, ఉన్నత అధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు రాజధాని రైతులు హాజరయ్యారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతిబింబించేలా వివిధ శాఖలకు చెందిన 22 శకటాలను ప్రదర్శించారు. వీటిలో వందేమాతరం ఇతివృత్తాన్ని చాటిచెప్పే శకటాన్ని ఆకర్షణీయంగా తీర్చి దిద్దారు. జీరో పావర్టీ మిషన్ ప్రణాళిక, వైద్యారోగ్యం, కుటుంబ సంక్షేమం, విద్య, స్త్రీ, శిశు సంక్షేమం, నైపుణ్య శిక్షణ, ఉపాధి తదితర శాఖలకు చెందిన శకటాలు ఆకట్టుకున్నాయి.
రాజధాని అమరావతిలో తొలిసారి ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
India Republic Day రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రభుత్వం నిర్వహిస్తోంది. రాయపూడి సమీపంలో సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి హైకోర్టుకు వెళ్లే దారిలో 22 ఎకరాల విస్తీర్ణంలో ఘనంగా ఈ వేడుకలు జరుగుతున్నాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలకు సీఎం చంద్రబాబు నాయుడు, సతీమణి నారా భువనేశ్వరి, డిప్యూటీ సీఎం […]

India Republic Day
Last Updated: 26 Jan 2026, 10:21 AM IST