Site icon HashtagU Telugu

Mango Price : వామ్మో కేజీ మామిడి ధర అక్షరాలా రూ.లక్ష..ఏంటో అంత ప్రత్యేకం !!

Miyazaki Mango Price

Miyazaki Mango Price

తెలుగు రాష్ట్రాల్లో మామిడిపండ్ల సీజన్ రావడం తో మార్కెట్లు మామిడి పళ్ళతో కళకళలాడుతున్నాయి. మామిడిపండ్లలో ఎన్నో రకాలు ఉన్నా, ఆంధ్రప్రదేశ్‌ నంద్యాల జిల్లాలో ఖరీదైన మియాజాకీ మామిడి సాగు చర్చనీయాంశమైంది. జపాన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ అరుదైన మియాజాకీ (Miyazaki Mango ) మామిడి, బంగ్లాదేశ్‌లో కిలో లక్ష రూపాయల వరకు ధర పలికిన సందర్భాలు ఉన్నాయి. ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్లు పుష్కలంగా ఉండటంతో, సంపన్నులు వీటి కొనుగోలుకు ఆసక్తి చూపిస్తారు.

Rains: ఈ ప్రాంతాల్లో నేడు భారీ వర్షం!

మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి (Prathap Reddy), బంగ్లాదేశ్‌ నుంచి ఈ అరుదైన మియాజాకీ మామిడి మొక్కలను తెప్పించి తన పొలాల్లో సాగు చేస్తున్నారు. 1,500 మామిడి మొక్కలను కొనుగోలు చేసినప్పటికీ, ప్రస్తుతం వాటిలో 400 మొక్కలు బతికి ఉన్నాయని తెలుస్తోంది. ఆయ‌న పొలం ఒక ప్రయోగక్షేత్రంలా మారి “బనానా మ్యాంగో”, “రెడ్ ఐవరీ”, “టామీ అట్కిన్స్”, “హనీడ్యూ”, “అమెరికన్ పాలిమర్”, “సెన్సేషన్” వంటి వివిధ రకాల అరుదైన మామిడి జాతులను కూడా సాగు చేస్తున్నారు. ఇందులో కొన్ని రకాలు ప్రత్యేకంగా మధుమేహ రోగులకు అనుకూలంగా ఉండగా, మరికొన్ని అధిక తియ్యతనంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ప్రతాప్ రెడ్డి తీసుకున్న శ్రమ ఫలించడంతో ఈ ఏడాది మియాజాకీ మామిడిలు ఫలించాయి. వీటిలో బీటా కెరోటిన్, విటమిన్-సి, విటమిన్-ఎ, ఫోలిక్ యాసిడ్ వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉండటంతో ఆరోగ్య ప్రయోజనాల కోసం ఈ మామిడులకు ప్రాధాన్యం పెరిగింది. ఉద్యానశాఖ సలహాలతో సాగు విధానాలను మెరుగుపరచి, రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న ప్రతాప్ రెడ్డి అనేకమంది రైతులను అరుదైన సాగు వైపు ప్రేరేపిస్తున్నారు.