రాష్ట్ర క్షేమం కోసం పనిచేసే విధానం అందరిలో రావాలని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). బుధువారం సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సమావేశం (District Collectors meeting
) సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ..ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం పాలసీలు రూపొందించడం పాలకుల ప్రధాన బాధ్యత. అయితే, ఆ పాలసీలను ప్రజలకు చేరవేసే కార్యం కార్యనిర్వాహక వ్యవస్థ చేతులపై ఉంటుంది. గత ఐదేళ్లలో ఈ పాలసీ పూర్తిగా విస్మరించబడింది. ప్రజాస్వామ్య విరుద్ధమైన పాలన వల్ల సామాన్య ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితులను తట్టుకుని, ప్రజాస్వామ్యానికి వన్నె తెచ్చే విధంగా పాలన సాగించేందుకు ప్రజల ఆశీర్వాదాన్ని పొందామని పేర్కొన్నారు.
గత ప్రభుత్వ కాలంలో నిబంధనలను పక్కన పెట్టి నిర్వాకం సాగిందని, కార్యనిర్వాహక వ్యవస్థలో సైతం ఆ నిస్సహాయత స్పష్టంగా కన్పించిందని పవన్ వ్యాఖ్యానించారు. సరైన నిర్ణయాలు తీసుకోలేక ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. అవసరమైతే రోడ్ల మీదకు వచ్చి ప్రజల తరఫున పోరాడిన అనుభవాలను పంచుకున్నారు. ఇసుక, మద్యం అమ్మకాల వంటి అంశాల్లో జరిగిన అక్రమాలు చూసినా స్పందించని పరిస్థితి అప్పట్లో కనిపించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సివిల్స్ పాసై ఉన్నత స్థాయి శిక్షణ పొందిన అధికారులు కూడా ఆ సమయంలో మౌనం వహించడం బాధ కలిగించిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా సిరియా, శ్రీలంక వంటి దేశాల్లో పాలకులు విఫలమైనప్పటికీ కార్యనిర్వాహక వ్యవస్థ బలంగా నిలబడి ప్రజలకు సేవలందించిందని, ఇక్కడ కూడా అలాంటి చిత్తశుద్ధి అవసరమని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని పొందేందుకు ఇప్పుడు మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని హితవు పలికారు.
Read Also : Jagan : రాష్ట్రంలో మళ్లీ రేషన్ మాఫియా మొదలైంది – జగన్