Site icon HashtagU Telugu

AP NDA Alliance : కూటమికే జై అంటున్న ప్రజలు..కారణాలు ఇవే..!!

Kutami Jai

Kutami Jai

ఏపీ(AP)లో ఈసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. 14 ఏళ్ల పాటు చంద్రబాబు (Chandrababu) పాలన చూసిన ప్రజలు ఒక్కసారి జగన్ (Jagan) కు ఛాన్స్ ఇచ్చి చూద్దాం..ఏంచేస్తారో అని గత ఎన్నికల్లో వైసీపీ కి పట్టం కట్టారు. కానీ ఆ తర్వాత వారు చేసింది ఎంత పెద్ద తప్పో అర్థమైంది. కానీ ఏంచేయలేని పరిస్థితి. అందుకే ఎన్నికల వరకు ఎదురుచూసారు. ఇక ఇప్పుడు ఎన్నికల సమయం రావడం తో తమ చేతికి పని చెప్పి..వైసీపీ కి బుద్ది చెప్పాలని చూస్తున్నారు. ముఖ్యంగా ప్రజలు కూటమి ఎందుకు కావాలనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం.

* కూటమి (AP NDA Alliance) విడుదల చేసిన మేనిఫెస్టో (NDA Manifesto) ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రజాకర్షక మ్యానిఫెస్టో కూటమి విజయానికి పునాది కావబోతుందని తెలుస్తుంది. బాబు ష్యూరిటీ- భవిష్యత్​ గ్యారెంటీ, పూర్​ టు రిచ్​ తో పాటు సూపర్​ సిక్స్​ పథకాలతో ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. యువతకు ఉద్యోగాల కల్పన, రైతులకు ఆదాయం, మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్​ సిలిండర్లు, మహాశక్తి పథకం ద్వారా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ప్రతి నెలా 1500 రూపాయల అందజేత, విద్యార్థులకు ప్రత్యేకంగా ఏటా నగదు అందజేత పథకాలు ఇలా ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగకరంగా ఉండడంతో ఇది చాలు కూటమి ఎందుకు కావాలనుకుంటున్నామో చెప్పడానికి అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

* రాష్ట్ర రాజధాని , పోలవరం పూర్తి :- రాష్ట్ర విభజనాంతరం రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుపై ఏపీ ప్రజలు భారీగా ఆశలు పెట్టుకున్నాకు. ఆ రెండింటి నిర్మాణాన్ని గత టీడీపీ ప్రభుత్వం చేపట్టగా..ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్..ఈ రెండిటిని పట్టించుకోలేదు. రాజధాని అమరావతి కాదని , రాష్ట్రానికి మూడు రాజధానులను నిర్మిస్తాం అని చెప్పి ఐదేళ్లుగా రాష్ట్రానికి రాజధాని అనేదే లేకుండా చేసారు. అలాగే టిడిపి ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్ట్ కొంతవరకు పూర్తి అయ్యింది. ఆ తర్వాత వైసీపీ దీనిని పూర్తీ చేయడం కాదుకదా..దాని వైపు చూడడమే మానేసింది. జలవనరుల శాఖ మంత్రులు ఇప్పుడు చేస్తాం..అప్పుడు చేస్తాం అంటూ చెప్పుకుంటూ ఐదేళ్లు గడిపారు. ఇక ఇప్పుడు ఈసారి గెలిపిస్తే రాజధానిని పూర్తి చేస్తాం..పోలవరం పూర్తి చేస్తామని చెపుతుంటే ఇక మిమ్మలా నమ్మేది అంటూ చెపుతున్నారు. కూటమి అధికారంలోకి రాగానే అమరావతిని రాజధానిని చేయడమే కాదు దేశంలోనే నెం 1 రాజధానిగా చేసి చూపిస్తాం అంటూ హామీ ఇస్తుండడం.,అలాగే పోలవరం ప్రాజెక్ట్ ను కూడా పూర్తి చేస్తామని చెపుతుండడం తో కూటమిని గెలిపించుకోవాలని చూస్తున్నారు.

* ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్నదే ప్రధాన ఉద్దేశం అంటూ టీడీపీ, బీజేపీ, జనసేన ఏకమయ్యాయి. కూటమి ఏర్పాటులో జనసేన అధినేత పవన్​ కళ్యాణ్ తీసుకున్న చొరవ అంతా ఇంతా కాదు. తమ పార్టీ పోటీ చేసే స్థానాలను తగ్గించుకుని మరీ బీజేపీని కలుపుకొన్నారు. పొత్తు ధర్మం పాటిస్తూ మూడు పార్టీల శ్రేణులు ఏకమయ్యాయి. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ప్రధాని సమావేశమైనా, చంద్రబాబు ప్రజాగళం సభలైనా, పవన్​ కళ్యాణ్ ర్యాలీలైనా సరే మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు కలిసి నడుస్తున్న తీరు ప్రజల్లో నమ్మకం కలిగిస్తుంది. పవన్ కళ్యాణ్ మాట ఇచ్చాడంటే అది చేసి చూపిస్తాడని ప్రజలు నమ్ముతూ..కూటమి గెలవాలని అంటున్నారు.

* ఐదేళ్ల జగన్​ పాలనలో అధికార పార్టీ నేతల అరాచకాలు భరిస్తూ వచ్చిన ప్రజలు ఈసారి కూటమికే మా మద్దతు అంటూ తేల్చి చెపుతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి పల్లెల్లో సైతం ఫ్యాక్షన్ వాతావరణం విస్తరించిందని అంటున్నారు. చిన్న చిన్న వివాదాలు చిలికి చిలికి గాలివానగా మారాయని, ఇసుక దందా, మట్టి తరలించుకుని స్థానికులపై దాడులకు తెగబడడం చేసారని అంటున్నారు. బీసీలు, దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆయా సంఘాల నాయకులు వాపోతున్నారు. దళిత ఉద్యోగుల హత్యలు, దాడులు, విద్యార్థిపై పెట్రోల్​ పోసి నిప్పంటించిన ఉదంతాలు ఇప్పటికీ ప్రజల కళ్ల ముందు కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇవన్నీ పోవాలంటే కూటమి అధికారంలోకి రావాలని అంటున్నారు.

* టీడీపీ, జనసేన నేతలపై వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయడం కూడా ప్రజల్లో ఆగ్రహం నింపింది. ముఖ్యంగా చంద్రబాబు ను అరెస్ట్ చేయించి జగన్ పెద్ద తప్పు చేసాడు. దాదాపు 52 రోజులకు పైగా జైల్లో పెట్టి ప్రజల్లో వ్యతిరేకతను పెంచుకున్నాడు. ఇలా ఎన్నో తప్పులు జగన్ & ఆయన బ్యాచ్ చేసారు కాబట్టే ఈసారి బాబు కు జై కొడుతున్నారు. ఈ విషయాన్నే అనేక సర్వేలే చెపుతూ వస్తున్నాయి. చూద్దాం ఏంజరుగుతుందో..!!

Read Also : Karnataka : ఆరేళ్ల మూగ కుమారుడిని మొసళ్లు తిరిగే నదిలో పడేసిన తల్లి..