Nara Lokesh: యువగళం పాదయాత్ర వల్ల దాదాపు 11 నెలల తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్ పర్యటించారు. దీంతో మంగళగిరి కుటుంబ సభ్యులు అడుగడుగునా ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తటస్థ ప్రముఖులను కలిసి నియోజకవర్గంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన అభివృద్ధి ప్రణాళికలపై వారితో చర్చించారు.
మంగళగిరి మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జొన్నాదుల వరప్రసాద్ నివాసానికి వెళ్లి లోకేశ్ ఆయనతో భేటీ అయ్యాడు. మంగళగిరిలో చేనేతలు, నేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, రాబోయే రోజుల్లో వారి కోసం చేపట్టాల్సిన సంక్షేమ కార్యక్రమాలపై చర్చించాడు. పద్మశాలి బహుత్తమ సేవా సంఘం అధ్యక్షుడు చింతకింది కనకయ్యను మర్యాదపూర్వకంగా కలుసుకొని వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు నారా లోకేశ్.
ఇక మున్సిపల్ కార్మికుల సమ్మెకు లోకేశ్ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఏపీ ఇప్పుడు ఉద్యమప్రదేశ్‌గా మారిందని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పాదయాత్రలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన జగన్ అందరినీ మోసం చేశారని విమర్శించారు. సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న మున్సిపల్, ఆశా వర్కర్లను ఆదుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Also Read: Bandi Sanjay: చారిత్రాత్మక ఆలయాన్ని దత్తత తీసుకున్న బండి సంజయ్