Machilipatnam SBI : మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే మచిలీపట్నం నగరంలో ఉన్న ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) బ్రాంచ్‌కు ఏకంగా 219 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇంతకీ అదెలా సాధ్యం అని అనుకుంటున్నారా ? వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.
Also Read :Cabinet Expansion : కాంగ్రెస్ హైకమాండ్ పరిధిలోకి మంత్రివర్గ విస్తరణ.. వాట్స్ నెక్ట్స్ ?
ఆ చారిత్రక బ్యాంకు గురించి తెలుసుకునే ముందు.. మనం మచిలీపట్నం చరిత్ర గురించి కొన్ని వివరాలను తెలుసుకోవాలి. బ్రిటీష్ కాలంలోనే మన దేశంలో ఏర్పడిన మూడో మున్సిపాలిటీ మచిలీపట్నమే. దీన్నిబట్టి అప్పట్లో బ్రిటీష్ వాళ్లు ఈ నగరానికి ఎంతటి ప్రాధాన్యత ఇచ్చేవారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇక్కడున్న ఎస్‌బీఐ చారిత్రక బ్రాంచ్ విషయంలోకి వెళ్దాం..
Also Read :Delhi Election Results 2025 : హ్యాట్రికా..? లేక 27 ఏళ్ల తర్వాత అధికారమా?
మచిలీపట్నం లక్ష్మీ టాకీస్ సెంటర్ ఎస్‌బీఐ బ్రాంచ్ చరిత్ర
- మచిలీపట్నం నగరంలోని లక్ష్మీ టాకీస్ సెంటర్ చాలా ఫేమస్. ఇక్కడే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Machilipatnam SBI) చారిత్రక బ్రాంచ్ నేటికీ ఉంది.
- 1806లో మచిలీపట్నం లక్ష్మీ టాకీస్ సెంటర్‌లోని బ్యాంకు శాఖను.. ‘బ్యాంక్ ఆఫ్ మద్రాస్’ పేరుతో 14 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఇక్కడే బ్యాంకు ఉద్యోగుల ట్రైనింగ్ సెంటర్‌ను కూడా నెలకొల్పారు.
- 1905 నుంచి ఈ బ్రాంచీని గుంటూరులో ఉన్న ‘బ్యాంక్ ఆఫ్ మద్రాస్’ ప్రధాన బ్రాంచీకి సబ్ బ్రాంచ్‌గా నిర్వహించడం మొదలుపెట్టారు.
- మచిలీపట్నం లక్ష్మీ టాకీస్ సెంటర్‌లోని బ్యాంకు శాఖను 1908 జనవరి 1 నుంచి ప్రత్యేక బ్యాంకు బ్రాంచీగా ఏర్పాటు చేశారు.
- కాలక్రమంలో ‘బ్యాంక్ ఆఫ్ మద్రాస్’ పేరును ‘ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’గా, ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’గా మార్చారు.
- ఆనాడు బ్రిటీష్ వాళ్ల దగ్గర పనిచేసే ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలను చెల్లించేందుకు ఈ బ్యాంకు శాఖను మచిలీపట్నంలో ఏర్పాటు చేశారు.
- రెండో ప్రపంచయుద్ధం (1913–1945) సమయంలో బ్రిటీష్ వాళ్లు ఈ బ్రాంచీలో భారీగా డబ్బు, బంగారం నిల్వలను దాచారు.
- 1923లో ఈ బ్రాంచీని ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలోకి చేర్చారు. 1923 నుంచి 1955 జూన్ 30 వరకు దాని పరిధిలోనే సేవలు అందించింది.
- 1955 సంవత్సరం జూలై 1 నుంచి ఈ బ్యాంకు శాఖ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)లో విలీనమై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారిపోయింది.
- బ్రిటీష్ కాలంలో పదిమంది కంటే తక్కువే ఉద్యోగులు ఈ బ్రాంచీలో పనిచేసేవారు.
- 1955లో ఈ బ్రాంచీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఏర్పడింది. దీంతో ఉద్యోగుల సంఖ్యను 20కి పెంచారు. అప్పట్లో బ్యాంకింగ్ సేవలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే అందుబాటులో ఉండేవి.
- ప్రస్తుతం మచిలీపట్నం లక్ష్మీ టాకీస్ సెంటర్‌లోని ఎస్‌బీఐ బ్రాంచీలో 50వేలకు పైగా ఖాతాదారులు ఉన్నాయి. ఇక్కడ రోజూ వెయ్యికిపైగా లావాదేవీలు జరుగుతున్నాయి.
- మచిలీపట్నం పేరు ఆర్బీఐ వద్ద నేటికీ మసులీపట్నంగానే నమోదై ఉంది.