Janasena : మరో 10 రోజుల్లో జనసేన అభ్యర్థుల లిస్ట్ విడుదల

  • Written By:
  • Publish Date - February 8, 2024 / 03:13 PM IST

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రజల్లో , ఇటు పార్టీల అభ్యర్థులో టెన్షన్ నెలకొంది. ఎవరికీ ఈసారి టికెట్స్ దక్కుతాయి..? ఎవరు ఎక్కడి నుండి పోటీ చేస్తారు..? ఎవరికీ గెలుపు అదృష్టం ఉంది..? ఎవరికీ లేదు..? ఇలా ఎవరికీ వారు లెక్కలు వేసుకుంటున్నారు. ప్రస్తుతం అధికార పార్టీ వైసీపీ 175 ను టార్గెట్ గా పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగుతుంది. ఇప్పటీకే వరుసపెట్టి అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తూ..ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇటు టిడిపి – జనసేన (TDP-Janasena) కూటమి ఉమ్మడి అభ్యర్థుల ఎంపిక ఫై కసరత్తులు చేస్తున్నాయి. ఇప్పటికే చెరో రెండు స్థానాలను ప్రకటించాయి. వైసీపీ నుండి పెద్ద ఎత్తున నేతలు చేరుతుండడం తో సీట్లకు సంబంధించి కాస్త ఆలస్యం అవుతుంది. ఈ క్రమంలో జనసేన నేత , మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) జనసేన అభ్యర్థుల తాలూకా అప్డేట్ ను తెలిపి పార్టీ శ్రేణుల్లో సంతోషం నింపారు. మరో ’10 రోజుల్లో జనసేన అభ్యర్థులను ప్రకటిస్తాం. నేను ఎక్కడ నుంచి పోటీ చేయాలో, జనసేన ఎన్ని స్థానాల్లో బరిలోకి దిగాలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నిర్ణయిస్తారు. పార్టీలో ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే.. పరిష్కరించుకొని ముందుకు వెళ్తాం అన్నారు.

టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీ కలుస్తుందనుకుంటున్నా’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా నాగబాబు అనకాపల్లి ఎంపీగా పోటీ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదే సందర్బంగా వైసీపీ సర్కార్ ఫై నాగబాబు విమర్శలు చేసారు. వైసీపీ ఏడో జాబితా కాదు.. లక్ష జాబితాలు విడుదల చేసినా మాకు నష్టం లేదన్నారు. అన్ని రంగాల్లో వైసీపీ ప్రభుత్వం విఫలం అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. వైఎస్‌ జగన్, వైసీపీ ఆంధ్ర జాతికి ప్రమాదకరం. కరోనా వైరస్ తరువాత ప్రమాదకర వైరస్ వైసీపీనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వైరస్ కు జనసేన, టీడీపీయే అసలైన మందుగా అభివర్ణించారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై వ్యక్తిగత దూషణలు తప్ప.. ఈ ప్రభుత్వంలో అభివృద్ధి లేదని దుయ్యబట్టారు.

Read Also : Telangana assembly sessions : ఫిబ్రవరి 13 వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు