భూ పట్టాదారు (ల్యాండ్ టైటిలింగ్ ) చట్టం అమల్లోకి వచ్చి ఉంటే ప్రజల ఆస్తులు దోచుకునే అవకాశం ఉండేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. భూ పట్టాదారు చట్టం రద్దు బిల్లుపై బుధవారం శాసనసభలో చర్చ జరిగింది. ఈ చర్చను మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు.
ప్రజల హక్కులను హరించేలా బిల్లు కనిపిస్తోందని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. ఈ చట్టం మరిన్ని భూ వివాదాలకు దారి తీయవచ్చని ఆయన పేర్కొన్నారు. పేద రైతులు సమస్యలు ఎదుర్కొంటే నేరుగా హైకోర్టును ఎలా ఆశ్రయిస్తారని ప్రశ్నించారు. చిన్న చిన్న వివాదాలకు ప్రజలు ఖరీదైన లాయర్లను ఎలా నియమించుకోగలరని ఆందోళన వ్యక్తం చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
దీన్ని అనుసరించి చంద్రబాబు నాయుడు భూ పట్టాల చట్టాన్ని ప్రమాదకరమైన చట్టంగా అభివర్ణించారు. గత ప్రభుత్వం సరైన పరిశీలన లేకుండా ఈ చట్టాన్ని ప్రవేశపెట్టిందని, ఫలితంగా అనేక సమస్యలు ఎదురవుతున్నాయని ఆరోపించారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా న్యాయవాదులు ఎలా నిరసనలు తెలిపారని, ప్రజలకు అవగాహన కల్పించారని ఆయన గుర్తు చేశారు.
భూమి తరతరాలుగా వస్తున్న వారసత్వ సంపద అని ఉద్ఘాటించారు. పట్టాదార్ పాస్‌బుక్‌ను ప్రభుత్వ ముద్రతో అందించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ముఖ్యమంత్రి ఫొటోతో పట్టాదార్ పాసుపుస్తకాలు జారీ చేయడం తగదని ప్రశ్నించారు. భూ వివాదాలు పెరిగిపోయాయని ఇటీవల జరిగిన భూ సర్వేను కూడా ఆయన ప్రస్తావించారు. భూ పట్టాల చట్టం లోపభూయిష్టంగా ఉందని తేల్చారు. ఈ చట్టానికి సంబందించి తెచ్చిన 512 జీవోను రహస్యంగా ఉంచారని చంద్రబాబు వెల్లడించారు. తాము వచ్చాక చట్టాన్ని రద్దు చేస్తామన్నామని ఇచ్చిన మాట ప్రకారం రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇతర దేశాల్లో ఉన్నవారి భూములు రికార్డులు మార్చితే రెండేళ్ల గుర్తించకపోతే డీమ్డ్ టూ బి అని పెట్టేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఈ నల్ల చట్టానికి సభ్యలు అందరూ కలిసి మంగళంపాడాలి అని కొరుతున్నా అని చంద్రబాబు అన్నారు.
Read Also : High Court : జగన్ కేసుల్లో రోజువారీ విచారణ కొనసాగించండి
