AP Job Calendar ఏపీలో ఉద్యోగాల జాతర మొదలైంది. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. మంత్రి నారా లోకేష్ తన X ఖాతాలో 10 వేల 60 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేశారు. ఈ ఏడాది మొత్తం 4 విడతల్లో, 41 నోటిఫికేషన్ల ద్వారా భర్తీ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
నోటిఫికేషన్ల విడుదల కోసం ప్రభుత్వం 4 ప్రధాన తేదీలను ఖరారు చేసింది. మే 15, ఆగస్టు 15, సెప్టెంబరు 15, అక్టోబరు 15 తేదీల్లో ఈ నోటిఫికేషన్లను విడుదల చేస్తారు. DSC ద్వారా మరోసారి 2,535 టీచర్ ఉద్యోగాలను పాఠశాల విద్యాశాఖ భర్తీ చేయనుంది. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 1,970 కానిస్టేబుల్ పోస్టులను, APPSC ద్వారా 400 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల నియామకాలను పూర్తిచేస్తారు. 147 ఫైర్ డ్రైవర్ ఆపరేటర్ పోస్టులను ఫైర్ డిపార్ట్‌మెంట్ భర్తీ చేయనుంది. అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ 1,500 పోస్టులకు APPSC రాత పరీక్ష నిర్వహిస్తుంది. అనంతరం యూనివర్సిటీల్లో ఇంటర్వ్యూల ద్వారా ఆ పోస్టులను భర్తీ చేస్తారు.
ఇక, గ్రూప్-1లో 91 పోస్టులు, SI- 418, జైల్ వార్డెన్(మెన్) 171, ఫోరెన్సిక్ లేబొరేటరీ పోస్టులు 64, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్ 93, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్ 48, బీసీ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్ 100, ప్లానింగ్‌లో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 251, ఇండస్ట్రీయల్ ప్రమోషన్ ఆఫీసర్ 95, గ్రూప్-2లో 750, గనుల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 503, ఏఎంవీఐ 50, డైట్ లెక్చరర్ 104, డైట్ సీనియర్ లెక్చరర్ 46, ఇంటర్ జూనియర్ లెక్చరర్ 209, పాఠశాల విద్యాశాఖలో లైబ్రేరియన్స్ 100 పోస్టులు ఉన్నాయి.
నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ, పారదర్శకమైన పద్ధతిలో ఉద్యోగాల భర్తీ చేపడుతున్నాం. నిర్దేశించిన సమయానికే నోటిఫికేషన్లు విడుదల చేసి, వేగంగా నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని నారా లోకేశ్ స్పష్టం చేశారు.
