Site icon HashtagU Telugu

Minister Lokesh : ఈ ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్నది ప్రభుత్వం ఆలోచన: మంత్రి లోకేశ్‌

The government plan is to provide 20 lakh jobs in these five years: Minister Lokesh

The government plan is to provide 20 lakh jobs in these five years: Minister Lokesh

Minister Lokesh : మంత్రి నారా లోకేశ్‌ ప్రకాశం జిల్లా పీసీ పల్లి మండలం దివాకరపల్లి సమీపంలో రిలయన్స్‌ సంస్థ ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్‌ బయో గ్యాస్‌ ప్లాంట్‌(సీబీజీ)కు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. యువగళం పాదయాత్ర సమయంలో ప్రజల కష్టాలను నేరుగా చూశానని లోకేశ్‌ అన్నారు. గత ఐదేళ్లూ రాష్ట్రంలో విధ్వంస పాలన కొనసాగిందని చెప్పారు. ఈ జిల్లాలో యువగళం పాదయాత్ర ప్రభంజనంలా సాగింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు గత ప్రభుత్వం ఏమీ చేయకపోగా వాటాలు ఇవ్వలేదని ఉన్న సంస్థలను తరిమేసింది. వైకాపా హయాంలో తీసుకొచ్చిన ఒక్క కంపెనీ పేరైనా చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నా. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు రూ.8లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి.

Read Also: Indian Prisoners : ఏ దేశంలో ఎంతమంది భారతీయ ఖైదీలున్నారు.. తెలుసా ?

దానికి సంబంధించిన పనులు ప్రారంభించాం. దానిలో భాగంగానే బయో గ్యాస్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం. ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నందుకు గర్వంగా ఉంది. ఈ ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్నది ప్రభుత్వం ఆలోచన అని లోకేశ్‌ అన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే గుర్తొచ్చేది ప్రేమ, పౌరుషం. ఈ జిల్లాకు సీఎం చంద్రబాబు, టీడీపీ అంటే చాలా గౌరవముంది. 2019లో ఎదురుగాలి ఉన్నా ఇక్కడి నుంచి నలుగురిని టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలిపించారు. 2024 ఎన్నికల్లో 10 సీట్లలో విజయం అందించారు.

చిత్తూరు, కడపలో ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీలు తీసుకొచ్చాం. కర్నూలుకు రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీలు తీసుకొచ్చాం. ప్రకాశం జిల్లాకు అతిపెద్ద పేపర్ మిల్ తీసుకొస్తే ఆ కంపెనీని గత ప్రభుత్వం రానివ్వలేదు. ఉభయగోదావరి జిల్లాలను ఆక్వా రంగంలో నంబర్-1గా నిలబెట్టాం. ఉత్తరాంధ్రను ఐటీ, ఫార్మా హబ్ గా తయారు చేశాం. అందరి ఆమోదంతో అమరావతిని రాజధానిగా ప్రకటించాం. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ ఎజెండాగా పనిచేశాం. అనంతపురంను ఆటోమొబైల్ హబ్ చేశాం. నా ధైర్యం ఒక్కటే… నా బ్రాండ్ ఒక్కటే దటీజ్ సీబీఎన్ అని చెప్పా. 2024లో సైకో పాలనకు బైబై చెప్పి రాష్ట్ర ప్రజలు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గెలిచిన మొదటి రోజు నుంచే ఉద్యోగాల వేట మొదలుపెట్టాం. యువగళం పాదయాత్ర నాలో మార్పు తెచ్చిందని మంత్రి లోకేశ్‌ అన్నారు.

Read Also: Elon Musk : ఫోర్బ్స్‌ సంపన్నుల జాబితా..మళ్లీ అగ్రస్థానంలో ఎలాన్‌ మస్క్‌