Site icon HashtagU Telugu

Agniveer : ‘అగ్నివీర్‌’ ఫైనల్ రిజల్ట్స్ వచ్చేశాయ్.. డైరెక్ట్ లింక్స్ ఇవిగో

Agnipath

Agnipath

Agniveer : భారత ఆర్మీ చేపట్టిన  ‘అగ్నివీర్’ పోస్టుల భర్తీకి సంబంధించిన తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈవివరాలను ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ విడుదల చేసింది. రిజల్ట్ వివరాలను  అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఏఆర్‌వో చెన్నై, విశాఖపట్నం, గుంటూరు, అంబాల, పుణె, జలంధర్‌, కోల్‌కతా, భోపాల్, దిల్లీ, రాంచీ తదితర జోన్లకు సంబంధించి రిజల్ట్స్ వెలువడ్డాయి. ఏఆర్‌వో సికింద్రాబాద్‌ జోన్‌ ఫలితాలు విడుదల కావాల్సి ఉంది.

గుంటూరు ఏఆర్వో పరిధిలోని రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

విశాఖ ఏఆర్వో పరిధిలోని రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా ఏప్రిల్ 17న దేశవ్యాప్తంగా కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహించారు. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి శారీరక సామర్థ్య, వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎంపికైన వారిని అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్/ స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్ కేటగిరీల్లో జాబ్స్ ఇస్తారు.  నాలుగేళ్ల కాలం పాటు అగ్నివీరులు (Agniveer) డ్యూటీలో ఉంటారు.

Also read : Hyderabad: 5 మూసీ వంతెనల నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన

Exit mobile version