Diwali – Special Trains : దీపావళిని మనం నవంబరు 12న జరుపుకోబోతున్నాం. ఈ తరుణంలో పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లొచ్చే వారి సంఖ్య ఎక్కువే ఉంటుంది. ప్రయాణికులు రద్దీ పెరిగే ఛాన్స్ ఉన్నందున.. అందుకు తగిన విధంగా రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తోంది. దీపావళి వేళ కొన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. వీటిలో కొన్ని ఆంధ్రప్రదేశ్‌లోని రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. స్పెషల్ ట్రైన్లు ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, పలాస, ఖుర్ధా రోడ్డు రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఈ నెల 11, 18, 25 తేదీల్లో చెన్నై సెంట్రల్ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని సంత్రాగచ్చి వరకు స్పెషల్ సూపర్ ఫాస్ట్ (నెంబర్ 06071) ట్రైన్ నడుస్తుంది. ఈ రైలు చెన్నై సెంట్రల్‌లో రాత్రి 11.45కి బయల్దేరి, మూడో రోజు తెల్లవారుజామున 3.45 గంటలకు సంత్రాగచ్చి స్టేషన్‌కు చేరుకుంటుంది. ఈ నెల 13, 20, 27 తేదీల్లో సంత్రాగచ్చి నుంచి చెన్నై సెంట్రల్ వరకు స్పెషల్ సూపర్ ఫాస్ట్ రైలు (నెంబర్ 06072) నడుస్తుంది. ఇది సంత్రాగచ్చిలో తెల్లవారుజామున 5 గంటలకు బయలుదేరి, మరుసటిరోజు ఉదయం 11 గంటలకు చెన్నై సెంట్రల్‌కు చేరుకుంటుంది. సంత్రాగచ్చి స్పెషల్ సూపర్ ఫాస్ట్ రైళ్లు ఏపీలోని గూడూరు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, పలాస, ఖుర్దా రోడ్డు రైల్వేస్టేషన్‌లలో ఆగుతాయి. ఒడిశాలోని భువనేశ్వర్, భద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్ స్టేషన్లలో కూడా వీటికి హాల్టింగ్ ఉంది.
- చెన్నై సెంట్రల్ – భువనేశ్వర్ మధ్య స్పెషల్ ట్రైన్ (నెంబర్ 06073) నవంబర్ 13, 20, 27 తేదీల్లో నడుస్తుంది. ఈ రైలు రాత్రి 11.45కి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6.30కి భువనేశ్వర్‌కు చేరుకుంటుంది.
- భువనేశ్వర్-చెన్నై సెంట్రల్ స్పెషల్ ట్రైన్ (నెంబర్ 06074) ఈ నెల 14, 21, 28 తేదీల్లో నడుస్తుంది. ఈ ట్రైన్ రాత్రి 9కి భువనేశ్వర్‌లో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు చెన్నై సెంట్రల్‌కు(Diwali – Special Trains) చేరుకుంటుంది.