Political Parties: ఏపీలో మరోసారి రాజకీయ కక్షలు (Political Parties) భగ్గుమన్నాయి. శ్రీకాళహస్తిలోని భాస్కర్ పేట నందు చాముండేశ్వరి ఆలయంలో కమిటీ అధ్యక్షుడు (వైసీపీ) పులి రామచంద్రయ్య నవరాత్రుల వేడుకలు నిర్వహిస్తున్నారు. శనివారం విజయదశమి కావటంతో అమ్మవారిని దర్శించుకోవడానికి శ్రీకాళహస్తి పురపాలక సంఘం మాజీ చైర్మన్ పార్థసారధి (టీడీపీ) దేవాలయానికి వచ్చారు. ఈ క్రమంలో పార్థసారధి, రామచంద్రయ్యకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చేటుచేసుకుంది. వాగ్వాదం కాస్త గొడవగా మారి ఆలయం బయట ఉన్న చెప్పులు, కర్రలతో దాడులు చేసుకున్నారు.
గొడవ కాస్త పెద్దది కావటంతో ఆలయం బయట ఉన్న చెప్పులు, కర్రలను ఉపయోగించుకున్నారు. ఒకరిపై ఒకరు చెప్పులతో కొట్టుకుంటూ గొడవలు చేసుకోవడంతోపాటు కర్రలతో కూడా దాడులు చేసుకున్నారు. అక్కడే ఉన్న భక్తులు ఇద్దరినీ విడదీసి గొడవను సదుమణిగేలా చేశారు. అయితే గతంలో రామలక్ష్మణుల లాగా ఉన్న పార్థసారథి, పులి రామచంద్రయ్య మధ్య గత కొన్ని సంవత్సరాలుగా బార్ కు సంబంధించిన డబ్బుల లావాదేవీల విషయంలో గొడవలు వచ్చినట్లు తెలుస్తోంది. అప్పటినుంచి ఇరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని చెబుతున్నారు.
Also Read: Optimus Robot : ఇరగదీసిన ఆప్టిమస్ రోబో.. వామ్మో మనుషుల్ని మించిపోయింది
దసరా నాడు భగ్గుమన్న రాజకీయ కక్షలు..
(Disturbing audio )అధికార, విపక్ష పార్టీల నాయకుల మధ్య ఘర్షణ ఒకరిపై ఒకరు దాడి శ్రీకాళహస్తీ పురపాలక సంఘం మాజీ చైర్మన్, ఆలయ కమిటీ చైర్మన్ పులి రామచంద్రయ్య మధ్య వాగ్వాదం . శ్రీకాళహస్తి చాముండేశ్వరి ఆలయం వద్ద ఘటన గతంలో మిత్రులుగా ఉండి.. ఆర్థిక… pic.twitter.com/wR3ka9WXPa
— ChotaNews (@ChotaNewsTelugu) October 12, 2024
మిత్రులు కాస్త శత్రువులుగా మారి ప్రచారం మాధ్యమాల్లో ఒకరిపై ఒకరు దుష్ప్రచారాలు చేసుకున్నారు. గతంలో కొంతమంది పెద్ద మనుషులు ఇందులో జోక్యం చేసుకొని వారి ఇరువురి మధ్య సంధికి ప్రయత్నించారు. అయితే రాజకీయపరంగా వేరువేరు పార్టీలో ఉన్న ఇరువురు ఏనాడు రాజీకి పోకపోవడంతో వారి ఇద్దరి మధ్య రాజకీయ కక్షలు పెరిగి పెరిగి పెద్దదై, నేడు విజయదశమి నాడు గుడి వద్ద చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకునే సమయంలో గొడవకు దారితీసింది. గత రాజకీయ కక్షలు కాస్త భగ్గుమని ఆలయం అనే విచక్షణ జ్ఞానం లేకుండా ఇరువురు నాయకులు ఒకరిపై ఒకరు చెప్పులతో కొట్టుకోవడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Also Read: Kaithal Accident: పండగపూట విషాదం.. 8 మంది దుర్మరణం