Site icon HashtagU Telugu

Power Cut : జగన్ వస్తున్నాడని కరెంట్ తీగలు కట్ చేస్తున్నారు..ఏంటి ఈ దారుణం..?

Current Wires

Current Wires

జగన్ (CM Jagan) వస్తున్నాడంటే ప్రజలు వణికిపోతున్నారు..ఎక్కడ అడ్డు వస్తున్నాయని చెట్లు కొట్టేస్తారో..ఎక్కడ రోడ్లు బంద్ చేస్తారో..ఎక్కడ బస్సులు లేకుండా చేస్తారో..బయటకు వెళ్లకుండా పరదాలు కట్టేస్తారో అని మొన్నటి వరకు రాష్ట్ర ప్రజలు మాట్లాడుకునే వాళ్లు. కానీ ఇప్పుడు ఏకంగా కరెంట్ తీగలు (Current Wires) కట్ చేస్తూ వారి అధికార పనితీరు చూపిస్తున్నారు. ప్రస్తుతం జగన్ మేమంతా సిద్ధం (Memantha Siddham) పేరుతో ఎన్నికల ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జగన్ ప్రచార రథానికి కరెంట్ తీగలు అడ్డు వస్తున్నాయి చెప్పి కట్ చేసిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ లో చోటుచేసుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

సిద్ధం కార్యక్రమంలో భాగంగా శ్రీసత్యసాయి జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో జాతీయ రహదారి 42 పై ఉన్నబత్తలపల్లి , ముదిగుబ్బ మండలాల్లో విద్యుత్ తీగలను తొలగించేశారు. ఇదే మార్గంలోని తనకల్లులో రోడ్డు పక్కన ఉన్న చెట్ల కొమ్మలను తెగ నరికేస్తున్నారు. వేసవికాలంలో రహదారికి అనుకుని ఉన్న చెట్ల నీడన ప్రయాణికులు సేద తీరేవారు. జగన్ పర్యటన పుణ్యమా అని పచ్చని చెట్ల కొమ్మలను నరికేస్తున్నారంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క విద్యుత్ కోత నిర్ణయంపై ప్రజలు మండిపడుతున్నారు. ఉదయం నుంచే కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జగన్ వస్తే కరెంట్ తీస్తారా..అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ..ఇదెక్కడి దారుణం అని మాట్లాడుకుంటున్నారు.

Read Also ; KTR: చేసింది చెప్పకపోవడమే మా తప్పు: కేటీఆర్