Site icon HashtagU Telugu

CM Chandrababu: ప్ర‌ధాని మోదీ నేతృత్వంలో దేశం ఆర్థికంగా బ‌లంగా త‌యారువుతోంది: సీఎం చంద్ర‌బాబు

CM Chandrababu

CM Chandrababu

CM Chandrababu: భారతీయ జనతా పార్టీకి వాజ్ పేయి పునాదులు వేస్తే ప్ర‌ధాని మోదీ దాన్ని మరింత బలోపేతం చేశార‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు (CM Chandrababu) అన్నారు. మోదీ నేతృత్వంలో దేశం ఆర్థికంగా బలంగా తయారవుతోందని, రానున్న రోజుల్లో ప్రపంచంలోనే భారతదేశం రెండు, మూడు స్థానాల్లో ఉంటుందని ధీమా వ్య‌క్తం చేశారు. నరేంద్రమోదీ మా లీడర్, ఆయన ఆధ్వర్యంలో ముందుకు వెళ్తామ‌న్నారు. హర్యానా సీఎం ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ప్రధాని ఆధ్వర్యంలో ఎన్డీయే కూటమి సీఎంల సమావేశం జరిగిందని తెలిపారు. నాలుగు గంటల పాటు జరిగిన సమావేశంలో 2029 ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం అవ్వాలన్న విషయంపై మోదీ అందరి అభిప్రాయాలు తీసుకున్నారని తెలిపారు.

ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో సీఎం చంద్రబాబు హిందుస్థాన్ టైమ్స్ లీడ‌ర్ షిప్‌లో ఇంకా మాట్లాడుతూ.. ఏపీలో కూడా 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి వచ్చింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పవన్ కళ్యాణ్ మూడు పార్టీలను కలిపారు. దాని ఫలితం ఇప్పుడు చూశాం. ఆంధ్రప్రదేశ్ ఫలితాలు ఏకపక్షంగా వస్తాయని మేము ముందుగానే ఊహించాం. జాతీయ స్థాయిలో కూడా బీజేపీకి పూర్తి మెజారిటీ వస్తుందని అనుకున్నాం. కూటమిలో ఎటువంటి సమస్యలు లేవు. అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతాం. మా కూటమి దీర్ఘకాలం కొనసాగుతుందన్నారు.

Also Read: Triple IT : విద్యార్థుల ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి : బండి సంజయ్‌

సోషల్ మీడియాలో విపరీత ధోరణులు కనిపిస్తున్నాయి. వ్యక్తిత్వ హసనం జరుగుతుంది. మహిళలను కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారు. టెలీకాం రంగంలో డీరెగ్యులేషన్ వల్ల పురోగతి ఉంటుందని రిపోర్ట్ ఇచ్చాను. దాన్ని అమలు చేయడం వల్ల టెలీకాం రంగం వృద్ధి చెందింది. సోషల్ మీడియాలో వేధించే సైకోలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాట్సాప్ గవర్నెన్స్ అనే విధానాన్ని తీసుకొస్తున్నాం. దేశంలోనే ఇది తొలిసారిగా అమలు చేస్తున్నాం. తద్వారా ప్రజా సేవలను చివరి వ్యక్తి వరకు అందించాలన్నది మా లక్ష్యం. ఈ యుగంలో సమాచారమే ఓ పెద్ద నిధి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్నాలజీలను ఉపయోగించి అన్ని రంగాల్లో పరిష్కారాలు వెతకొచ్చు. ఒక స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచంలో ఏ మూల ఉన్నా మన పనులు చేసుకుంటూ పోవచ్చని చంద్ర‌బాబు తెలిపారు.