Site icon HashtagU Telugu

Nara Lokesh : మంత్రి లోకేశ్‌ కృషికి కేంద్రం మద్దతు..విద్యాశాఖకు అదనంగా నిధులు మంజూరు

The Center supports the efforts of Minister Lokesh.. Additional funds have been sanctioned to the Education Department.

The Center supports the efforts of Minister Lokesh.. Additional funds have been sanctioned to the Education Department.

Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగం అత్యుత్తమంగా అభివృద్ధి చెందుతున్నది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ నేతృత్వంలో “ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్” దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించి, విద్యారంగంలో నాణ్యతను మెరుగుపరచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుండటంతో, కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి మద్దతు తెలుపుతూ రూ.432.19 కోట్ల అదనపు నిధులను సమగ్రశిక్ష కింద మంజూరు చేసింది. ఈ నిధుల వెనుక మంత్రి లోకేశ్‌ చొరవ మరియు కృషి కీలకం. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత రాష్ట్రానికి కేంద్రం నుండి అనేక విద్యా పథకాల కింద నిధుల ప్రవాహం మొదలైంది. గతంతో పోల్చితే, ఏపీకి విద్యా రంగంలో కేంద్రం అధిక ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. ముఖ్యంగా, లోకేశ్‌ నడిపించిన సుస్థిర వ్యూహాలు, వినూత్న విద్యా కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఆకట్టుకున్నాయి.

Read Also: Heavy rains : భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించేందుకు ప్రభుత్వం ఐసీటీ ల్యాబ్స్, స్మార్ట్ తరగతులు, సైన్స్ ల్యాబ్‌ల ఏర్పాటుకు రూ.167.46 కోట్ల అదనపు నిధులను కేంద్రం మంజూరు చేసింది. అలాగే డైట్ కళాశాలలను సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ ఏడాది రూ.43.23 కోట్ల నిధులు ఇచ్చింది. గతంలో కేవలం 50 శాతం నిధులు మాత్రమే లభించగా, ఈసారి దాదాపు 96 శాతం నిధులు మంజూరయ్యాయి. ఇది విద్యా బలీకరణలో గణనీయమైన అడుగు. గిరిజన విద్యార్థుల అభివృద్ధికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ (DA-JGUA) కింద రాష్ట్రంలోని ఆదివాసీ విద్యార్థుల కోసం నాలుగు వసతి గృహాల నిర్మాణానికి రూ.11 కోట్లు మంజూరయ్యాయి. ఇది కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం కాగా, 2024-29 కాలానికి అమలులో ఉండనుంది. ఈ పథకం ద్వారా గిరిజన గ్రామాలకు మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య, ఉపాధి అవకాశాలను కల్పించడం లక్ష్యం.

ఇక, ప్రధానమంత్రి జనజాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (PMJANMAN) కింద రాష్ట్రానికి రెండు దశల్లో మొత్తం 79 హాస్టళ్లు మంజూరయ్యాయి. గత సంవత్సరం కేవలం నాలుగు హాస్టళ్లు మాత్రమే మంజూరవగా, ఈ ఏడాది భారీ స్థాయిలో కేంద్రం నిధులు విడుదల చేసింది. దీని విలువ రూ.210.5 కోట్లు. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (PM SHRI) పథకం కింద కూడా రాష్ట్రానికి గొప్ప గుర్తింపు లభించింది. ఇప్పటి వరకు 855 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఈ విద్యా సంవత్సరం అదనంగా మరో 80 పాఠశాలలను ఎంపిక చేయడంలో మంత్రి లోకేశ్ కీలక పాత్ర పోషించారు. దేశవ్యాప్తంగా 14,500 పీఎంశ్రీ పాఠశాలల్లో ఏకైక రాష్ట్రంగా ఏపీకే 935 పాఠశాలలు కేటాయించబడ్డాయి. ఈ మొత్తాన్ని పరిశీలిస్తే, ఏపీ విద్యాశాఖ దేశానికి మార్గదర్శకంగా మారే దిశగా ముందుకు సాగుతోంది. మంత్రి నారా లోకేశ్‌ సుదీర్ఘ దృష్టికోణం, సమర్థ నాయకత్వం, కేంద్రంతో సమన్వయంతో నడిపిన ప్రయత్నాల ఫలితంగా రాష్ట్రానికి ఈ భారీ నిధులు లభించాయి. విద్యారంగంలో నాణ్యతా ప్రమాణాలను పెంచి, అన్ని వర్గాల విద్యార్థులకు సమాన అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతో ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దిశగా ముందుకు సాగుతోంది.

Read Also: Attack : ఢిల్లీలో ఊహించని ఘటన..సీఎం రేఖా గుప్తాపై దాడి..!