Tirumala Tirupati Devasthanams (TTD) పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంపై వైసీపీ కుట్రలు కొనసాగుతున్నాయి. ఆలయ పవిత్రతను దెబ్బతీసి, TTDతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలనే లక్ష్యంతో వైసీపీ నేతలు చేసిన కుట్ర బయపడింది. తిరుమలలో మద్యం బాటిళ్లు, అలిపిరి టోల్‌గేట్ ద్వారా నిత్యం తిరుమలకు మద్యం అంటూ ఈ నెల 4న సోషల్‌మీడియాలో ఫేక్ ప్రచారం చేసిన కేసులో తిరుపతికి చెందిన వైసీపీ కార్యకర్త ఆళ్లపాక కోటి, సాక్షి ఫొటోగ్రాఫర్ మోహన్‌కృష్ణను పోలీసులు బుధవారం అరెస్టుచేశారు.
Kousthubham Guest House Tirumala
మరో నిందితుడు వైసీపీ సోషల్‌మీడియా కార్యకర్త నవీన్ పరారవ్వడంతో అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేకబృందాలు రంగంలోకి దిగాయి. వీరంతా తిరుపతి నుంచి ఖాళీ మద్యం సీసాలు తీసుకొచ్చి, వాటిని తిరుమలకు తరలించి..అక్కడ పొదల్లో పారేసి, ఆ ఫొటోలు, వీడియోలు తీసి సోషల్‌మీడియాలో పెట్టినట్లు దర్యాప్తులో తేలింది. తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు, భద్రతా వైఫల్యం ఉందంటూ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు కుట్ర చేసినట్లు అధికారులు గుర్తించారు.
Ysrcp Leader Car
పక్కా ప్లాన్ ప్రకారం –
ముందస్తు ప్లాన్ ప్రకారం తిరుపతి నుంచి ఖాళీ మద్యం సీసాలు తీసుకెళ్లి తిరుమల బాలాజీ కాలనీ ప్రాంతంలోని కౌస్తుభం అతిథిగృహం కాంపౌండ్‌వాల్ బయట చెట్లపొదల వద్ద పడేశారు వైసీపీ కార్యకర్త ఆళ్లపాక కోటి.ఈ నెల 4న తిరుమలకు వెళ్లి ఖాళీ మద్యం సీసాల సమాచారాన్ని వైసీపీ సోషల్‌మీడియా కార్యకర్త నవీన్‌కు చెప్పారు. నవీన్ ఆ విషయాన్ని ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్ మోహన్‌కృష్ణకు చెప్పడంతో అతను సాక్షి ఫొటోగ్రాఫర్లు గిరి, ప్రసాద్, ముకేశ్‌లను అక్కడకు పంపి, వారిద్వారా వీడియోలు తీయించారు. ఆ వీడియోలను సోషల్‌మీడియాలో వైరల్ చేసి TTDపై దుష్ప్రచారం స్టార్ట్ చేశారు.
Tirumala
ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆళ్లపాక కోటి, రెండో నిందితుడు సాక్షి ఫోటోగ్రాఫర్ మోహన్‌కృష్ణను అరెస్టు చేశారు. వారి నుంచి 2 ఫోన్లు, స్విఫ్ట్ డిజైర్ కారు, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. మోహన్‌కృష్ణ ఉద్దేశపూర్వకంగా తన మొబైల్ దాచిపెట్టి..ఫోన్ పోయిందని చెబుతున్నాడని పోలీసులు గుర్తించారు. మూడో నిందితుడు నవీన్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
