Site icon HashtagU Telugu

Results: AP ఇంటర్ ఫలితాలు విడుద‌ల‌.. రిజ‌ల్ట్స్‌ చెక్ చేయండిలా, వెబ్‌సైట్‌లు ఇవే..!

Telangana DSC Results

Telangana DSC Results

Results: AP ఇంటర్ 1వ, 2వ సంవత్సరం ఫలితాలు (Results) విడుద‌ల చేశారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (BIEAP) తన ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో AP ఇంటర్ ఫలితాలను ప్రకటించింది. మ‌రికాసేప‌ట్లో AP ఇంటర్ 1వ, 2వ సంవత్సరం ఫలితాల లింక్‌లు resultsbie.ap.gov.inలో యాక్టివేట్ చేయబడతాయి. విద్యార్థులు తమ హాల్ టిక్కెట్ నంబర్‌లను ఉపయోగించి BIEAP IPE 1వ, 2వ సంవత్సరం స్కోర్‌లను తనిఖీ చేయవచ్చు.

ఈ సంవత్సరం IPE 1వ సంవత్సరం పరీక్షలో మొత్తం ఉత్తీర్ణత శాతం 67 శాతంగా ఉంది. IPE 2వ సంవత్సరం పరీక్షలో మొత్తం ఉత్తీర్ణత శాతం 78 శాతంగా ఉంది. ఈ ఏడాది మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన ఇంటర్మీడియట్‌ పరీక్షలకు దాదాపు 10 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ఫస్ట్ ఇయర్ పరీక్షలు 5,17,617 మంది, సెకండ్ ఇయర్ పరీక్షలు 5,35,056 మంది విద్యార్ధులు రాశారు. 52,900 మంది విద్యార్ధులు పరీక్షలకు గైర్హాజరైనట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది.

ఈసారి కూడా బాలిక‌లే పైచేయి సాధించారు. సెకండియ‌ర్‌లో అమ్మాయిలు 81 శాతం, అబ్బాయిలు 75 శాతం మంది పాస‌య్యారు. ఫ‌స్ట్ ఇయ‌ర్‌లో అమ్మాయిలు 71 శాతం, అబ్బాయిలు 64 శాతం మంది పాస్ అయ్యారు. ఫ‌స్ట్‌, సెకండ్ ఇయ‌ర్‌లో కృష్ణా జిల్లా టాప్ ప్లేస్‌లో నిలిచింది. అంతేకాకుండా అధికారులు అడ్వాన్స్డ్ స‌ప్ల‌మెంట‌రీ పరీక్ష తేదీల‌ను కూడా ప్ర‌క‌టించారు. మే 24 నుంచి జూన్ 1 మ‌ధ్య వీటిని నిర్వ‌హించ‌నున్నారు. త్వ‌రలోనే పూర్తి షెడ్యూల్ విడుద‌ల కానుంది.

Also Read: Umpire Nitin Menon: అంపైర్‌ను బ్యాన్ చేయాల‌ని ఆర్సీబీ ఫ్యాన్స్ డిమాండ్‌.. ఇంత‌కీ నితిన్ మీన‌న్ చేసిన తప్పిదాలేంటి..?

AP ఇంటర్ ఫలితాలను చెక్ చేసుకోండిలా

AP ఇంటర్మీడియట్ ఫలితాలు 2024 కోసం మీ స్కోర్‌లను తనిఖీ చేయడానికి ఈ దశలను అనుసరించండి.

– bie.ap.gov.inలో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

– హోమ్‌పేజీలో AP ఇంటర్ ఫలితాలు 2024 కోసం అందించిన లింక్‌పై క్లిక్ చేయండి.

– మీ ఆధారాలను నమోదు చేయడం ద్వారా లాగిన్ చేయండి.

– ఆ త‌ర్వాత మీ AP ఇంటర్మీడియట్ ఫలితాల స్కోర్ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.

– AP ఇంటర్ ఫలితాల మార్క్ షీట్‌ను డౌన్‌లోడ్ చేయండి. భవిష్యత్ సూచన కోసం మార్క్ షీట్ హార్డ్ కాపీని మీ ద‌గ్గ‌ర ఉంచుకోండి.

We’re now on WhatsApp : Click to Join

విద్యార్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోగల వెబ్‌సైట్‌ల జాబితా ఇదే..!

– results.gov.in

– results.bie.ap.gov.in

– examsresults.ap.nic.in

– results.apcfss.in bie.ap.gov.in