Site icon HashtagU Telugu

AP Govt key Decision on CCS : ఏపీ ఉధ్యాయులకు జగన్ గుడ్ న్యూస్..సీపీఎస్ పై ఏమన్నారంటే….!!

Cm Jagan

Cm Jagan

టీచర్ డే సందర్భంగా 74మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ఏపీ టీచర్లకు శుభవార్త అందించారు. పరోక్షంగా CCS అంశాన్ని ప్రస్తావించారు. ఏ ఒక్కరూ కూడా పట్టించుకోని ఉద్యోగులు పెన్షన్ గురించి ఆలోచిస్తున్నామని చెప్పారు. మంచి పరిష్కారం కోసం పనిచేస్తున్నామన్న జగన్…గతంలో ఏనాడూ ఉద్యోగుల మీద ప్రతిపక్షం సానుభూతిని చూపలేదన్నారు.

ఉద్యోగులకు మంచి దిశగా ఏనాడూ ఆలోచించలేదన్నారు. ఉద్యోగుల శ్రేయస్సు కోరుకుంటున్న ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు పెన్షన్ గురించి ఒక వ్యాక్యం కూడా రాయని..ఎల్లో మీడియా…ఇప్పుడు పరిష్కారం కోసం ప్రయత్నిస్తుంటే..రెచ్చగొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉపాధ్యాయులకు ప్రభుత్వ పాఠశాలలకు ఎన్నడూ లేని విధంగా గౌరవాన్ని పెంచిన సర్కార్ మనదన గుర్తుచేశారు. ఉపాధ్యాయులకు అన్నివిధాలా మంచి చేయడంలో సర్కార్ ముందుంటుందన్నారు.