TDP Suspends MLA Koneti Adimulam : తప్పు ఎవరు చేసిన బాబు యాక్షన్ ఇలాగే ఉంటుంది..

TDP Suspends MLA Koneti Adimulam : తిరుపతిలోని బీమాస్ హోటల్‌లో తనపై లైంగిక వేధింపులకు దిగినట్టు బాధితురాలు తెలిపింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ ఎమ్మెల్యే తనపై బెదిరింపులకు దిగినట్టు తెలియజేసింది.

Published By: HashtagU Telugu Desk
Tdp Has Suspended Satyavedu

Tdp Has Suspended Satyavedu

MLA Koneti Adimulam Suspends : చంద్రబాబు (Chandrababu) నిజాయితీ..పాలన విషయంలోనే కాదు తప్పు చేసిన వారిపై శిక్ష విధించడం లో కూడా ఆయనకు ఆయనే సాటి అనిపించుకున్నారు. మహిళల విషయంలో తప్పు చేస్తే.. అవతలి పార్టీ నేతలే కాదు సొంత పార్టీ నేతలపై కూడా త్వరగా యాక్షన్ తీసుకుంటాడని కోనేటి ఆదిమూలం (MLA Koneti Adimulam) ఘటన తో అందరికి అర్థమైంది. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం..అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఓ మహిళఫై ఒత్తిడి తెచ్చి లైంగిక దాడికి పాల్పడినట్లు తేలడం తో వెంటనే చంద్రబాబు సదరు ఎమ్మెల్యే ను పార్టీ నుండి సస్పెండ్ చేసాడు. ఈ ఆదేశాల పట్ల యావత్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తప్పు చేసాడని తేలడం తో ఏమాత్రం ఆలోచించకుండా..వెంటనే సస్పెండ్ చేయడం అనేది ఒక్క చంద్రబాబు కే చెల్లిందని కొనియాడుతున్నారు.

ఆదిమూలం (MLA Koneti Adimulam)కు సంబదించిన వీడియోస్ ను బాధితురాలే బయట పెట్టింది

మహిళల విషయంలోనే కాదు మరేతర విషయాల్లో కూడా తప్పు చేస్తే అది సొంత పార్టీ నేతైనా , పక్క పార్టీ నేతైనా సరే చట్టం ముందు అంత సమానమే అని చంద్రబాబు తీసుకున్న నిర్ణయం తో అర్థమైందని అంటున్నారు. ఇక ఆదిమూలం కు సంబదించిన వీడియోస్ ను సదరు బాధితురాలే బయటపెట్టింది. వీడియోలు బయటకు వచ్చినప్పటి నుండి ఎమ్మెల్యే అందుబాటులో లేరు. ఈ వ్యవహారం బయటకు వచ్చిన కేవలం రెండు గంటల వ్యవధిలో ఎమ్మెల్యేపై వేటు వేసింది పార్టీ. ఇక ఎమ్మెల్యే చేతిలో లైంగిక వేధింపులకు గురైన బాధితురాలు.. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో తన భర్తతో కలిసి మీడియా ముందుకొచ్చింది.

ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ ఎమ్మెల్యే (MLA Koneti Adimulam) బెదిరించాడు

తిరుపతిలోని బీమాస్ హోటల్‌లో తనపై లైంగిక వేధింపులకు దిగినట్టు బాధితురాలు తెలిపింది. ఈ వ్యవహారాన్ని ఇప్పటికే పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లానని, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌కు లేఖ రాసినట్టు తెలిపింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ ఎమ్మెల్యే తనపై బెదిరింపులకు దిగినట్టు తెలియజేసింది. తాను టీడీపీకి చెందినవారమేనని వెల్లడించింది. ఆదిమూలం తనపై మూడుసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని , ఎమ్మెల్యే నిజస్వరూపాన్ని పెన్ కెమెరాతో బట్ట బయలు చేసానని, తన కోరిక తీర్చకుంటే కుటుంబాన్ని అంతం చేస్తానంటూ బెదిరించారని కంటతడి పెట్టుకుంది.

Read Also : Simba is Coming : సింబా వచ్చేస్తున్నాడు.. మోక్షజ్ఞ మూవీ అనౌన్స్ చేసిన ప్రశాంత్ వర్మ..!

  Last Updated: 05 Sep 2024, 04:26 PM IST