23 Sentiment For Chandrababu : మళ్లీ చర్చగా మారిన చంద్రబాబు ’23’

ప్రస్తుతం టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) కు గత కొద్దీ కాలంగా '23' అనే సెంటిమెంట్ వెంటాడుతుంది.

  • Written By:
  • Updated On - September 11, 2023 / 11:27 AM IST

23 Sentiment For Chandrababu : ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని సెంటిమెంట్లు అనేవి ఉంటాయి..అందులో కొన్ని శుభసూచకంగా.. మరికొన్ని అశుభంగా. ప్రస్తుతం టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కు గత కొద్దీ కాలంగా ’23’ అనే సెంటిమెంట్ వెంటాడుతుంది.

ఏపీ స్కిల్‌ డెవలవప్‌మెంట్‌  (Skill Development Case)కేసులో.. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)కు ఏసీబీ కోర్టు (ACB Court) 14 రోజుల రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. అప్పటివరకు కోర్ట్ తీర్పు తమకు అనుకూలంగానే వస్తుందని టీడీపీ శ్రేణులు , చంద్రబాబు తరుపు లాయర్లతో పాటు యావత్ ప్రజానీకం భావించింది. కానీ ఏసీబీ కోర్ట్ మాత్రం CID కి సపోర్ట్ గా తీర్పు ఇచ్చి షాక్ ఇచ్చింది. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలి సారి చంద్రబాబు.. జ్యూడీషియల్‌ రిమాండ్‌కు వెళ్లారు. ఏసీబీ కోర్టు ఆదేశాలతో సీఐడీ పోలీసులు.. చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలు (Rajahmundry Central Jail) కు తరలించారు.

రాజమండ్రి జైలు అధికారులు.. చంద్రబాబుకు స్నేహా బ్లాక్‌లో ప్రత్యేక గదిని సిద్ధం చేశారు. అంతే కాకుండా అన్ని వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. చంద్రబాబుకు రిమాండ్ ఖైదీ నెంబర్ 7691 కేటాయించారు. ఇప్పుడు ఇదే మరోసారి చంద్రబాబు 23 ని గుర్తు చేసింది. ఈ నెంబర్(7+6+9+1) ను మొత్తం కలిపి కూడితే 23 రావడం విశేషం.

Read Also : Chandrababu Remand : నా కోసం నిలబడిన వ్యక్తికి నేను మద్దతు ఇవ్వడం నా బాధ్యత – పవన్

ఏపీ విభజన తరువాత తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు (Chandrababu) పరిపాలన సాగించారు. ఈయన ఐదేళ్ల పాలన తరువాత 2019లో అసెంబ్లీ ఎన్నికలు  జరిగాయి. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ కి.. అధికార పార్టీ నాయకుడు చంద్రబాబుకు మధ్య హోరా హోరీ పోరు సాగింది. ఏప్రిల్ 2019 ఏప్రిల్ 23 వ తేదీన ఎన్నికల ఫలితాలను విడుదల (2019 AP Election Results) చేసింది ఎలక్షన్ కమిషన్. ఈ కౌంటింగ్ తేదీ కూడా 23 కావడమే విశేషం.

వైసీపీకి, టీడీపీకి మధ్య జరిగిన పోరులో వైసీపీకి 151, టీడీపీకి 23, జనసేనకు 1 సీటు వచ్చింది. ఈ పోరు లో వైసీపీ తిరుగులేని విజయం సాధించింది. అలాగే తృటిలో ప్రతిపక్ష హోదాను కోల్పోయే ప్రమాదం నుంచి చంద్రబాబు తప్పించుకున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుండి ఎంత మంది ఎమ్మెల్యేలను లాక్కున్నారో అన్నే సీట్లు భగవంతుడు కట్టబెట్టాడని వైసీపీ నాయకులు విమర్శలు చేసారు. ఆలా 23 నంబర్ చంద్రబాబును మూడోసారి వరించింది.

ఇక ఇప్పుడు రాజమండ్రి ఖైదీ నంబర్లోనూ 23..

చంద్రబాబు హయాంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో భారీ కుంభకోణం జరిగిందని సీఐడీ చంద్రబాబు అరెస్ట్ చేసి.. ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టగా సుదీర్ఘ వాదనల తరువాత చంద్రబాబు కు 14 రోజుల రిమాండ్ విధిస్తు కోర్ట్ తీర్పు ఇచ్చింది. దీంతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అక్కడ ఈయనకు ఖైదీ నంబర్ 7691 నంబర్ ను కేటాయించారు. ఈ నాలుగు అంకెలను (7+6+9+1 = 23) కూడితే మొత్తం 23 వస్తోంది. దీంతో జైలుకు వెళ్లినా బాబును ఈ నంబర్ వదలడం లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

ఇదే సందర్బంగా వివాదాలకు కేరాఫ్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ సైతం చంద్రబాబు 23 సెంటిమెంట్ ను ట్విట్టర్ వేదికగా గుర్తు చేసారు. “ఇప్పుడు చంద్రబాబు ఖైదీ నంబర్ 7691. అంటే.. 7+6+9+1=23. ఇది ఆయన 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన సీట్ల సంఖ్య. ఇది నమ్మశక్యం కాని యాదృచ్ఛికం” అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. అంతేకాదు.. దీని వెనక గ్రహాలు పనిచేస్తున్నాయని తెలిపి మరింత గందగోళానికి గురి చేసాడు. మరి ఈ 23 చంద్రబాబు ను ఎప్పుడు వీడుతుందో..ఎప్పుడు మంచి రోజులు వస్తాయో అని టీడీపీ శ్రేణులు మాట్లాడుకుంటున్నారు.