నందమూరి బాలకృష్ణ (Balakrishna) హోస్ట్ చేస్తున్న అహా ఓటీటీ ‘అన్‌స్టాపబుల్ 4’ (Unstoppable with NBK ) షో పై అంచనాలు ఏ స్థాయిలో నెలకొన్నాయో తెలియంది కాదు. ఇప్పటికే మూడు సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి కావడం..ఈ సీజన్ అంతకు మించి ఉండబోతుందని అంత భావిస్తున్నారు. ఇక ఈ సీజన్ 4 మొదటి ఎపిసోడ్ కు బాలయ్య బావ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (Chandrababu) తో స్టార్ట్ చేయడం..విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ ఎపిసోడ్ తాలూకా ప్రోమో .. సరదాగా, ఆసక్తికర ప్రశ్నలతో సాగినట్లు చూపించేసరికి. ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అంటూ అభిమానులు , పార్టీ శ్రేణులు ఇలా యావత్ ప్రజానీకం ఎదురుచూసారు. వారి ఎదురుచూపులు , అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఎపిసోడ్ సాగింది. రాష్ట్ర భవిష్యత్తు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో భేటీ, చంద్రబాబు జైలులో గడిపిన 53 రోజుల అనుభవాలు, వ్యక్తిగత విషయాలు వంటి పలు అంశాల గురించి వివరించారు.
మీరు జైల్లో ఉన్న టైం లో పవన్ కళ్యాణ్ స్వయంగా జైలు కు వచ్చి కలిశారు..అప్పుడు ఏమాట్లాడారు..? అని బాలయ్య అడిగిన ప్రశ్నకు చంద్రబాబు సమాధానం ఇచ్చారు. ఎలా ఉన్నారు సార్..? రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు ప్రయత్నిస్తానని చెప్పడం, ఒక విధంగా రాజకీయ వ్యూహం కేంద్రీకరించడం అనిపించింది. అందరితో కలిసి పోటీ చేద్దామని సలహా ఇవ్వడం, బీజేపీతో కలిసి పని చేయాలనే తత్వాన్ని తెలియజేసారు.
అప్పుడు నేనే ముందు అన్నాను. ఓ సారి ఆలోచించండి. అందరం కలిసి పోటీ చేద్దామని పవన్‌తో అన్నాను. ఆయన కూడా ఆలోచించి ఓకే అన్నాడు. బీజేపీకి కూడా నచ్చజెప్పి కూటమిలోకి తీసుకువస్తానని చెప్పాడు అని చంద్రబాబు అన్నారు. ఆ తరువాత బయటకు వెళ్లి కూటమి ప్రకటన చేసినట్లుగా చంద్రబాబు చెప్పారు. అదే తమ విజయానికి నాంది అని అన్నారు.
ఫస్ట్ డే జైలులో ఎలా గడిచింది..?
నంద్యాల నుంచి అడవుల్లో అమరావతికి తీసుకొచ్చారు. రాత్రంతా ఇన్వెస్టిగేషన్ పేరుతో అటు ఇటు తిప్పి తెల్లారి మెడికల్ టెస్టులకు తిప్పారు. ఆ తర్వాత అక్కడా ఇక్కడా తిప్పి కోర్టుకు తీసుకెళ్లారు. అక్కడ సాయంత్రం వరకు ఆర్గ్యుమెంట్స్ చేసారు. అర్ధరాత్రి రాజమండ్రి జైలుకి పంపించారు. ఆ రాత్రి చేయని తప్పుకు అరెస్ట్ చేయడం, ఆ చేసిన విధానం చూసి గుండె తరుక్కుపోయింది. నేను అక్కడికి వెళ్ళినప్పుడు సందేహంగా కొన్ని సంఘటనలు జరిగాయి. అయినా నేను ధైర్యంగా ఉన్నాను, ఎదుర్కొన్నాను కాబట్టి ఏమి జరగలేదు. లేకపోతే ఏమయ్యేదో ఇంకోలా ఉండేది. చనిపోతే ఒక్క క్షణం. అనుకున్న ఆశయం కోసం పనిచేస్తే అది శాశ్వతం. అదే నన్ను ముందుకు నడిపించింది. చావు గురించి ఆలోచిస్తే జీవితంలో ఏది చేయలేము అని అన్నారు.
యువగళం పాదయాత్రతో లోకేశ్ లో ఎంతో మార్పు వచ్చింది
రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు/మున్సిపాలిటీలు, 2,028 గ్రామాల మీదుగా 226 రోజులపాటు లోకేశ్ పాదయాత్ర సాగింది. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి 3,132 కిమీ లోకేశ్ పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్ర మొదటి నుంచి ప్రమాణ స్వీకారం దాకా విశ్రమించకుండా పనిచేసాడు. యువగళం పాదయాత్రతో లోకేశ్ లో ఎంతో మార్పు తీసుకొచ్చింది. లోకేష్ యువగళం కంటే ముందు లోకేష్ యువగళం తరువాత అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
Read Also : Second Marriage : రెండో పెళ్లి పై సమంత క్లారిటీ..