Jagan – Lokesh : జగన్ కు లోకేష్ కు తేడా ఇదే..దటీజ్ లోకేష్ అన్న !!

Jagan - Lokesh : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)లో నాయకులు తమ అధినేత జగన్‌ను మెప్పించడానికి ఇష్టం వచ్చినట్లుగా వ్యక్తిగత దూషణలకు, అభ్యంతరకర భాషకు పాల్పడటం గతంలో చూశాం

Published By: HashtagU Telugu Desk
Jagan Lokesh

Jagan Lokesh

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)లో నాయకులు తమ అధినేత జగన్‌ను మెప్పించడానికి ఇష్టం వచ్చినట్లుగా వ్యక్తిగత దూషణలకు, అభ్యంతరకర భాషకు పాల్పడటం గతంలో చూశాం. అలాంటి బూతు రాజకీయాలు చేయకపోతే జగన్ మెచ్చరనే అభిప్రాయం ఆ పార్టీలో బలంగా ఉండేది. అయితే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మాత్రం భిన్నమైన వైఖరిని అవలంబిస్తోంది. టీడీపీ జాతీయ కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పార్టీ విలువలు, క్రమశిక్షణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు తయారు చేసిన ఒక వివాదాస్పద AI వీడియోపై లోకేష్ తక్షణమే స్పందించారు. ఇది టీడీపీ విలువల ఆధారిత రాజకీయాలకు కట్టుబడి ఉందనడానికి నిదర్శనం.

Lokesh US Tour : పెట్టుబడులే లక్ష్యంగా లోకేష్ యూఎస్ టూర్

టీడీపీ సోషల్ మీడియా క్యాడర్ ఇటీవల రూపొందించిన ఒక AI వీడియోలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, మరియు లోకేష్ నడుచుకుంటూ వెళ్తుండగా, జగన్ రెడ్డి పక్కన ప్లకార్డు పట్టుకుని “ప్లీజ్ గివ్ మీ అపొజిషన్ స్టేటస్” అని అడుక్కుంటున్నట్లుగా చూపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తరుణంలో ఇది తన దృష్టికి రాగానే లోకేష్ సుతిమెత్తగా చీవాట్లు పెట్టారు. “ఇలాంటివి టీడీపీ విధానాలకు విరుద్ధమని” స్పష్టమైన సూచన చేస్తూ, వ్యక్తిగత దాడులు ఎప్పుడూ మంచివి కావని పేర్కొన్నారు. “మనం రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు, కానీ మన ప్రవర్తనం గౌరవంగా ఉండాలి” అని లోకేష్ హితవు పలికారు. అలాంటి కంటెంట్‌ను నివారించాలని, వ్యతిరేకత వ్యక్తం చేయడంలోనూ మర్యాదను కాపాడుకుందామని, రాష్ట్ర అభివృద్ధిపై, నిర్మాణాత్మక రాజకీయాలపై దృష్టి పెడదామని ఆయన సూచించారు.

నిజానికి ఆ AI వీడియో అంత అభ్యంతరకరంగా లేనప్పటికీ, టీడీపీ నాయకత్వం వెంటనే స్పందించడం ద్వారా పార్టీలో బూతులు, వ్యక్తిగత దూషణలు ఉండకూడదనే గీతను స్పష్టం చేసింది. గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఇలాంటి సందర్భం ఎప్పుడైనా ఉందా అని ప్రశ్నించుకుంటే, వారు తమ కార్యకర్తలను మందలించడం పక్కన పెట్టి, ఇంకా ప్రోత్సహించారనే విమర్శ ఉంది. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, బూతులు లేని రాజకీయాలు ఏపీ ప్రత్యేకతగా మారాయి. టీడీపీ నేతలు మాట్లాడినా, వైసీపీ నేతలు మాట్లాడినా చర్యలు తీవ్రంగా ఉంటున్నాయి. లోకేష్ నాయకత్వం తమ క్యాడర్‌ను అవసరమైతే గట్టిగా, లేకపోతే సుతిమెత్తగా దారిన పెట్టే ప్రయత్నం చేయడం వల్ల, సామాజిక మాధ్యమాలలో గౌరవప్రదమైన చర్చా వాతావరణం నెలకొనడానికి వీలు కలుగుతోంది.

  Last Updated: 26 Nov 2025, 11:07 AM IST