ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించే దిశగా అడుగులు వేస్తోంది. టెక్నాలజీ రంగంలో అగ్రగామి సంస్థ గూగుల్, విశాఖలో అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా హబ్‌ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ కోసం గూగుల్ సుమారు $15 బిలియన్ (సుమారు రూ. 1.25 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనుంది. తాజాగా ఈ ఒప్పందంపై ఢిల్లీలో సంతకాలు జరగడం విశాఖ అభివృద్ధికి కీలక ఘట్టంగా నిలిచింది. గూగుల్ డేటా సెంటర్ రాకతో రాష్ట్రానికి గ్లోబల్ పెట్టుబడులు ఆకర్షించే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేస్తోంది. టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో విశాఖను హబ్‌గా మార్చాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఇది పెద్ద బలం చేకూరుస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.
IPL 2026 Retention: ఐపీఎల్ 2026 రిటెన్షన్ లిస్ట్.. ఏ రోజు, ఎక్కడ లైవ్ చూడాలి?
గూగుల్ క్లౌడ్ గ్లోబల్ రెవెన్యూ ప్రెసిడెంట్ మాట్ రెన్నర్ ఈ పెట్టుబడికి వెనుక ఉన్న కారణాలను వివరించారు. భారతదేశంలోని B2B (బిజినెస్ టు బిజినెస్) మరియు B2C (బిజినెస్ టు కస్టమర్) రంగాల్లో ఏఐ మరియు డేటా సొల్యూషన్‌లకు వేగంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగానే విశాఖలో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. భారత్‌ను గూగుల్ ఒక కీలక వృద్ధి మార్కెట్‌గా పరిగణిస్తోందని పేర్కొన్నారు. స్థానిక వ్యాపారాలు తమ డేటా సార్వభౌమత్వం, కస్టమర్ అవసరాలను తీర్చడానికి ఆధునాతన పరిష్కారాలు కావాలన్న అవసరం పెరిగిందని అన్నారు. అందుకే భారతదేశంలో ఉన్న విస్తృత మార్కెట్‌కి తగిన మౌలిక సదుపాయాలను సృష్టించడం గూగుల్ ప్రధాన లక్ష్యమని రెన్నర్ చెప్పారు.
అయితే ఈ ప్రాజెక్ట్‌తో పాటు కొన్ని ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఏఐ సాంకేతికత వాడకం పెరగడంతో అనేక కంపెనీలు మానవ వనరులపై ఆధారపడకుండానే పనులు పూర్తి చేస్తుండటంతో ఉద్యోగులలో భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ, ఈ డేటా సెంటర్ రాకతో భారతీయ కంపెనీలు తక్కువ ఖర్చుతో అధునాతన ఏఐ సేవలను పొందగలవన్నది మరోవైపు సానుకూల అంశం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పెట్టుబడిని స్వాగతిస్తూ, దీని ద్వారా విశాఖను దక్షిణ ఆసియాలోని టెక్ హబ్గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. గూగుల్ ఈ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేస్తే, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, దేశం మొత్తం డిజిటల్ యుగంలో మరో పెద్ద దశ ముందుకు వేయనుంది.
