Site icon HashtagU Telugu

Thammineni :`న‌కిలీ`స‌ర్టిఫికేట్ల భాగోతం! విచార‌ణ‌కు TDP డిమాండ్

Thammineni

Andhra Pradesh Speaker Thammineni Sitaram Ycp Minister

ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ తమ్మినేని సీతారాం(Thammineni) ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఉంటారు. ఆయ‌న స్పీక‌ర్ చైర్ ను అధిరోహించిన త‌రువాత ప్ర‌తిప‌క్షాన్ని టార్గెట్ చేసిన సంద‌ర్భాలు అనేకం. అంతేకాదు, ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యే మాదిరిగా విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేస్తుంటారు. పార్టీల‌కు అతీతంగా మెల‌గాల్సిన ఆయ‌న వైసీపీ కండువాతో కార్య‌క్ర‌మాల్లోనూ పాల్గొంటారు. ప్ర‌తిప‌క్ష‌నేత చంద్ర‌బాబు మీద కూడా నేరుగా విమ‌ర్శ‌లు చేస్తుంటారు. హావ‌భావాలు కూడా స్పీక‌ర్ స్థానంలో ఉంటూ ప్ర‌తిప‌క్షం మీద వ్య‌తిరేకంగా చూపుతుంటారు. అలాంటి ఆయ‌న ఇప్పుడు న‌కిలీ డిగ్రీ స‌ర్టిఫికేట్ల(Fake Certificates) వ్య‌వ‌హారం చిక్కుకున్నారు.

సీతారాం న‌కిలీ డిగ్రీ స‌ర్టిఫికేట్ల వ్య‌వ‌హారం (Thammineni)

ప‌ట్ట‌భ్ర‌దుడిగా ఆయ‌న అఫిడ‌విట్ లో పొందుప‌రిచారు. అంతేకాదు, న్యాయ‌వాదిగా కూడా ఫోక‌స్ అయ్యారు. కానీ, డిగ్రీ ఎక్క‌డా చ‌ద‌వ‌లేద‌ని(Fake Certificates) టీడీపీ ఇప్పుడు చెబుతోంది. త‌మ్మినేని(Thammineni) చ‌దువుపై గ‌త కొన్ని రోజులుగా స‌మాచార హ‌క్కు చట్టం కింద టీడీపీ ప్ర‌తినిధి న‌న్నూరి న‌ర్సిరెడ్డి అధ్య‌య‌నం చేశారు. ఆయ‌న డిగ్రీ న‌కిలీ స‌ర్టిఫికేట్లను క‌లిగి ఉన్నార‌ని చెబుతున్నారు. వాస్త‌వంగా స్పీక‌ర్ చెబుతోన్న దాని ప్ర‌కారం అంబేద్క‌ర్ ఓపెన్ యూనివ‌ర్సిటీలో డిగ్రీ ప‌ట్టా పొందారు. తీరా, ఆ యూనివర్సిటీలో చ‌ద‌వ‌లేద‌ని తేలింది. అయిన‌ప్ప‌టికీ ఆ యూనివ‌ర్సిటీ నుంచి స‌ర్టిఫికేట్ల‌ను ఎలా పొందార‌ని న‌ర్సిరెడ్డి నిల‌దీస్తున్నారు.

నకిలీ సర్టిఫికెట్లేనని న‌ర్సిరెడ్డి

న‌కిలీ సర్టిఫికెట్ల(Fake Certificates) వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని, తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. తమ్మినేని తనదిగా చెబుతున్న హాల్‌టికెట్ నెంబరు 1791548430 డి.భగవంత్‌రెడ్డి, తండ్రి బి.స్వామిరెడ్డి పేరిట ఉందని తేలింది. ఇవన్నీ చూస్తుంటే తమ్మినేని బీకాం డిగ్రీ సర్టిఫికెట్‌తోపాటు ప్రొవిజనల్, మైగ్రేషన్, టీసీ సహా అన్నీ నకిలీ సర్టిఫికెట్లేనని న‌ర్సిరెడ్డి ఆరోపిస్తున్నారు. డిగ్రీ మధ్యలోనే ఆపేసిన తమ్మినేని (Thammineni) మూడేళ్ల లా కోర్సు ఎలా చేశారన్న అనుమానంతో సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కనుక్కుంటే అసలు విషయం వెలుగులోకి వచ్చింద‌ట‌.

మూడేళ్ల లా కోర్సు కోసం తమ్మినేని

బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలోని నాగర్ కర్నూలు స్టడీ సెంటర్ నుంచి 2015-18లో తమ్మినేని(Thammineni) బీకాం పూర్తిచేసినట్టు సర్టిఫికెట్లు సమర్పించారు. కానీ ఆ సెంటర్‌లో 2015లో చదువుకున్న మొత్తం 839 మంది విద్యార్థుల జాబితాలో తమ్మినేని పేరు లేదు. ఇక, మూడేళ్ల లా కోర్సు కోసం తమ్మినేని సీతారాం సమర్పించిన ఓపెన్ యూనివర్సిటీ ప్రతులు నిజమైనవా? కావా? తేల్చాలని స‌మాచార చట్టం ద్వారా అడిగితే, తమ రికార్డులతో ఆయన సర్టిఫికెట్లు సరిపోలడం లేదని వర్సిటీ అధికారికంగా ధ్రువీక‌రించారు. ఆ విష‌యాన్ని న‌ర్సిరెడ్డి వెల్ల‌డించారు.

Also Read : YCP-TDP :ద‌ళిత కార్డ్ తీసిన జ‌గ‌న్ !CBN టార్గెట్‌

మొత్తం మీద త‌మ్మినేని (Thammineni) విద్యార్హ‌త ఏమిటి? అనేది బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఆయ‌న డిగ్రీ చ‌ద‌వ‌లేద‌ని టీడీపీ చెబుతోంది. ప‌ట్ట‌భ‌ద్రుడు కాకుండానే లా చేయ‌డం అసాధ్యం. అలాంటి వ్య‌క్తి ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ గా ఉండ‌డం పెద్ద తప్పుగా టీడీపీ భావిస్తోంది. అందుకే, ఆయ‌న మీద విచార‌ణ చేయాల‌ని కోరుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌తిప‌క్షం మీద ఎగిరెగిరిప‌డే త‌మ్మినేని ఇప్పుడు టీడీపీ చేస్తోన్న ఆరోప‌ణ‌ల మీద ఎక్క‌డా స్పందించ‌లేదు. గ‌త కొన్ని రోజులుగా న‌ర్సిరెడ్డి చేస్తోన్న ఆరోప‌ణ‌ల‌కు మౌన‌మే స‌మాధానం అన్న‌ట్టు తమ్మినేని ఉండ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది.

Also Read : YCP- BJP : బంధానికి గండి! జ‌గ‌న్ స‌ర్కార్ కు మూడిన‌ట్టే?