Thalliki Vandanam : మేలో ‘తల్లికి వందనం’ అమలు – సీఎం చంద్రబాబు

Thalliki Vandanam : సాంకేతికత ఆధారిత పాలనను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి వాట్సాప్ గవర్నెన్స్‌ను అమలులోకి తీసుకువచ్చామని సీఎం చంద్రబాబు చెప్పారు

Published By: HashtagU Telugu Desk
Thallikivandanam May

Thallikivandanam May

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) విద్యార్థుల తల్లులకు ఆర్థిక సాయంగా ‘తల్లికి వందనం’ (Thalliki Vandanam) పథకాన్ని మే నెలలో అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ప్రకటించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని విద్యార్థుల తల్లులకు ప్రతి విద్యార్థికి రూ.15,000 చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు, తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని తీసుకువస్తున్నామని సీఎం తెలిపారు. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి అందరికీ ఈ సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

Mega DSC : ఏప్రిల్ మొద‌టివారంలో మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్: సీఎం చంద్ర‌బాబు

అంతేగాక రాష్ట్రాన్ని టెక్నాలజీ హబ్‌గా మార్చే లక్ష్యంతో 2 లక్షల మంది AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ప్రొఫెషనల్స్‌ను తయారు చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రముఖ సాంకేతిక దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని ఆయన తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్ర విద్యార్థులకు AI విద్యను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, ఉపాధి అవకాశాలను పెంచేలా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.

Rishabh Pant-Sanjiv Goenka: ఓటమి తర్వాత పంత్‌తో ల‌క్నో యజమాని మీటింగ్? వీడియో వైర‌ల్‌!

సాంకేతికత ఆధారిత పాలనను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి వాట్సాప్ గవర్నెన్స్‌ను అమలులోకి తీసుకువచ్చామని సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వ అధికారులకు ప్రజలకు మధ్య త్వరితమైన సమాచార ప్రవాహాన్ని అందించేందుకు, సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ‘తల్లికి వందనం’ వంటి పథకాల ద్వారా విద్యా రంగ అభివృద్ధికి కృషి చేస్తూనే, సాంకేతికతను ప్రభుత్వ పరిపాలనలో సమర్థంగా ఉపయోగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

  Last Updated: 25 Mar 2025, 12:32 PM IST