Site icon HashtagU Telugu

AP : అమ‌లాపురానికి చేరుకున్న టెక్సాస్ రోడ్డు ప్ర‌మాద మృత‌దేహాలు.. అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించిన బంధువులు

Road Accident In Texas In A

Road Accident In Texas In A

అమెరికా నుంచి కోనసీమ జిల్లా అమలాపురం చేరుకున్న ఐదుగురి మృతదేహాలకు మంగళవారం రాజమహేంద్రవరంలోని కోటిలింగాల ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. మృతులు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ బంధువులు.. పొన్నాడ నాగేశ్వరరావు (68), అతని భార్య సీతామహాలక్ష్మి (65) కుటుంబంతో కలిసి ఉంటున్న కుమార్తె నవీనాను చూసేందుకు అమలాపురం నుంచి అమెరికా వెళ్లారు. టెక్సాస్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగేశ్వరరావు, సీతామహాలక్ష్మి, నవీనా కుమారుడు కృత్తిక (11), ఆమె కుమార్తె నిషేధ (9) మరణించారు. నాగేశ్వరరావు అల్లుడు గాయపడి అమెరికాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతదేహాలు అమలాపురం చేరుకోవడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సీహెచ్. శ్రీనివాస వేణు గోపాలకృష్ణ మృతుల‌కు నివాళ్లు అర్పించారు. ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మృతదేహాలను అంత్యక్రియల నిమిత్తం రాజమహేంద్రవరంలోని కోటిలింగాల రేవుకు తరలించారు.

Also Read:  YSRCP : హిందూపురం వైసీపీ ఎంపీ అభ్య‌ర్థిగా బ‌ళ్లారి మాజీ ఎంపీ