AP Election Counting : కౌంటింగ్ రోజున ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకుంటాయో..?

పోలింగ్ రోజే రాష్ట్రంలో చాల చోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పదుల సంఖ్యలో ప్రజలు పలువురి చేతిలో గాయపడ్డారు. ఇక ఎన్నికల ఫలితాల కౌంటింగ్ రోజు ఇంకెలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకుంటాయో అని ఖంగారు పడుతున్నారు

Published By: HashtagU Telugu Desk

ఏపీలో ఎన్నికల ఫలితాల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రజల్లో టెన్షన్ వాతావరణం పెరిగిపోతుంది. పోలింగ్ రోజే రాష్ట్రంలో చాల చోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పదుల సంఖ్యలో ప్రజలు పలువురి చేతిలో గాయపడ్డారు. ఇక ఎన్నికల ఫలితాల కౌంటింగ్ రోజు ఇంకెలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకుంటాయో అని ఖంగారు పడుతున్నారు. నిఘా వర్గాలు సైతం ఈ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

కౌంటింగ్ లో అక్రమాలు జరిగితే ఎదుర్కొంటామని, ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే రాజకీయ పార్టీలు ఏ స్దాయిలో అలర్ట్ గా ఉన్నాయో అర్థమవుతోంది. ఇవన్నీ చూస్తుంటే ఈసారి కసిగా జరిగిన పోలింగ్ రేపు ఏదైనా ఫలితాల్లో తేడా వస్తే హింసకు కూడా కారణమవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ పోటీ చేసిన పిఠాపురం వంటి చోట్ల కూడా హింసకు అవకాశం ఉందంటూ అందిన నిఘా అలర్ట్స్ రాష్ట్రంలో పోలీసుల్ని సైతం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరి రాష్ట్రంలో ఏంజరుగుతుందో..ఎలాంటి దాడులు జరుగుతాయో..పోలీసులు అలాంటి కఠిన చర్యలు తీసుకుంటారో చూడాలి.

Read Also : Water After Meal : భోజనం చేసిన వెంటనే నీళ్లెందుకు తాగకూడదు?

  Last Updated: 22 May 2024, 08:54 PM IST